వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాఫీ డే కింగ్ మరో సంస్థకు ఆర్థిక నష్టాలు. కంపెనీ క్లోజ్, ఆందోళనలో ఉద్యోగులు, డార్క్ ఫారెస్ట్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కేఫ్ కాఫీ డే కింగ్ సిద్దార్థ ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర నష్టాలు రావడంతో ఆయనకు చెందిన మరో కంపెనీ మూతపడింది. కార్మికులు ఆందోళనకు దిగకుండా చూడటానికి పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. కాఫీ డే కింగ్ సిద్దార్థ స్థాపించిన చిక్కమగళూరులోని డార్క్ ఫారెస్ట్ ఫర్నిచర్ కంపెనీ మూపివేయాలని ఆయన కుటుంబ సభ్యలు, వ్యాపార భాగస్వాములు ఇప్పటికే నిర్ణయించారు. ఈ సందర్బంగా చిక్కమగళూరులోని ఎబీసీ ఆవరణంలోని డార్క్ ఫారెస్ట్ ఫర్నిచర్ కంపెనీ చుట్టుపక్కల ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించారు. పోలీసులు అధిక సంఖ్యలో డార్క్ ఫారెస్ట్ ఫర్నిచర్ కంపెనీ పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు చేశారు.

సతీ సావిత్రి, భర్తను చంపేసి వంటిట్లో పూడ్చేసి పొయ్యి పెట్టి వెరైటీ వంటలు, అక్రమ సంబంధం!సతీ సావిత్రి, భర్తను చంపేసి వంటిట్లో పూడ్చేసి పొయ్యి పెట్టి వెరైటీ వంటలు, అక్రమ సంబంధం!

సొంత కంపెనీ

సొంత కంపెనీ

8 ఏళ్ల క్రితం కేఫ్ కాఫీ డే సంస్థకు అనుభందంగా పారిశ్రామికవేత్త సిద్దార్థ హెగ్డే అలియాస్ సిద్దార్థ డార్క్ ఫారెస్ట్ ఫర్నిచర్ కంపెనీని చిక్కమగళూరు నగరంలో స్థాపించారు. దేశ విదేశాల్లోని కాఫీ డే సంస్థల్లో ఫర్నిచర్ ఏర్పాటు చెయ్యడానికి సరికొత్త టెక్నాలజీతో ఇక్కడే ఫర్నిచర్ తయారు చేసి తరలించాలని సిద్దార్థ నిర్ణయించారు. చిక్కమగళూరులోని సొంత కంపెనీలో తయారు చేసిన ఫర్నిచర్ ను దేశ విదేశాల్లోని కాఫీ డే బ్రాంచ్ లకు ఫర్నిచర్ తరలించారు.

విదేశాల్లోని బ్రాంచ్ లకు ఫర్నిచర్

విదేశాల్లోని బ్రాంచ్ లకు ఫర్నిచర్

కర్ణాటకతో పాటు భారతదేశంలోని బ్రాంచ్ లు, విదేశాల్లోని కాఫీ డే బ్రాంచ్ లకు చిక్కమగళూరులోని డార్క్ ఫారెస్ట్ ఫర్నిచర్ కంపెనీలో తయారైన ఫర్నిచర్ తరలించారు. విదేశాల నుంచి ఖరీదైన చెక్కలు ఇక్కడికి తెప్పించి ఫర్నిచర్ తయారు చేశారు. సిద్దార్థ స్థాపించిన ఈ కంపెనీలో విదేశాల నుంచి తీసుకువచ్చిన వుడ్ తో పాటు ఇక్కడి గయాన్ వుడ్, రోస్ వుడ్, సిల్వర్ బీచ్, చిక్కమగళూరులో ప్రసిద్ది చెందిన అకేషియా సిల్వర్ వుడ్ తో తయారు చేసిన చక్కటి ఫర్నిచర్ దేశ విదేశాలకు సిద్దార్థ తరలించారు.

ఐటీ దాడులతో కష్టాలు

ఐటీ దాడులతో కష్టాలు

చిక్కమగళూరులో సిద్దార్థ ఈ కంపెనీ స్థాపించిన తరువాత దేశ, విదేశాలతో పాటు స్థానికంగా నివాసం ఉంటున్న సుమారు 600 మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చారు. కంపెనీ ఉద్యోగులకు సిద్దార్థ ఆకర్షనీయమైన జీతాలు చెల్లించారు. కాఫీ డే కంపెనీ మీద ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) దాడులు చేసిన తరువాత ఈ కంపెనీ ఉద్యోగులకు కష్టాలు మొదలైనాయి. 2019 జులై 29వ తేదీ చిక్కమగళూరు సమీపంలోని నేత్రావతి నదిలో దూకిన సిద్దార్థ ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దార్థ ఆత్మహత్య చేసుకున్న తరువాత ఈ కంపెనీలో చాల మంది ఉద్యోగులను తీసివేశారు. ఇప్పుడు ఏకంగా కంపెనీనే మూసివేస్తున్నారని కంపెనీ ఉద్యోగులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

 నెల ముందే నిర్ణయం

నెల ముందే నిర్ణయం

కాఫీ డే కింగ్ సిద్దార్థ ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కంపెనీని మూసివేయాలని నెల రోజుల క్రితమే నిర్ణయించారని తెలిసింది. నెల రోజుల నుంచి ఈ కంపెనీలో ఎలాంటి ఫర్నిచర్ తయారు చెయ్యడం లేదు. ఈ నెల 25వ తేదీన ఈ కంపెనీని మూసివేస్తున్నామని కంపెనీ నిర్వహకులు ఉద్యోగులకు కొన్ని రోజుల క్రితం నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు

కంపెనీని పూర్తిగా మూసివేయాలని నిర్ణయించారు.

Recommended Video

దొరికిన సిద్ధార్థ భౌతిక కాయం! || VG Siddhartha’s Was Found From The Netravati River || Oneindia
ఏం చెయ్యాలి ?

ఏం చెయ్యాలి ?

చిక్కమగళూరులోని డార్క్ ఫారెస్ట్ ఫర్నిచర్ కంపెనీ ముందు ఆందోళన చెయ్యాలని ఆ కంపెనీ ఉద్యోగులు నిర్ణయించారు. అయితే సోమవారం కంపెనీ ముందు గుమికూడిన ఉద్యోగులు న్యాయపోరాటం చెయ్యాలని చర్చలు జరుపుతున్నారని తెలిసింది. మొత్తం మీద కాఫీ డే కంపెనీ వ్యవస్థాపకుడు సిద్దార్థ ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన స్థాపించిన మరో కంపెనీ ఆర్థిక నష్టాలతో మూతపడింది.

English summary
Coffee Day owner, businessman Siddhartha owned Dark Forest Furniture Company closed due to loss in Chikamagaluru in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X