College girl: కొండ మీద బాయ్ ఫ్రెండ్ ను కట్టేసి గర్ల్ ఫ్రెండ్ మీద గ్యాంగ్ రేప్, హోంమంత్రి ఎంట్రీ !
బెంగళూరు/ మైసూరు: ప్రపంచ ప్రసిద్ది చెందిన రాచనగరి సమీపంలోని ప్రసిద్ది చెందిన పుణ్యక్షేత్రం సమీపంలో దారుణంగా జరిగింది. కాలేజ్ లో చదువుకుంటున్న యువతి, యువకుడు కొండ మీద ఉన్న పుణ్యక్షేత్రంలో స్వామి దర్శనం చేసుకున్నారు. తరువాత బైక్ లో కొండ దిగుతున్న సమయంలో కాలేజ్ విద్యార్థిని, ఆమె స్నేహితుడు మార్గం మద్యలో రోడ్డు పక్కన నిలబడి ఉన్నారు. ఆ సమయంలో ఆరు మంది కామాంధులు కాలేజ్ అమ్మాయి, ఆమె స్నేహితుడి మీద దాడి చేశారు. ఇద్దరిని పుణ్యక్షేత్రం కొండ మీద నిర్జనప్రదేశంలోకి లాక్కొని వెళ్లారు. అమ్మాయి స్నేహితుడిని బండరాయితో దాడి చేసి చితకబాదేశారు. తరువాత కాలేజ్ అమ్మాయిని నిర్జనప్రదేశంలోని లాక్కొని వెళ్లిన కామాంధులు ఆమె మీద సామూహిక అత్యాచారం చేశారు. కాలేజ్ అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేసిన కామాంధులు ఆ విషయం బయటకు చెబితే మిమ్మల్ని ఇద్దర్నీ చంపేస్తామని బెదిరించి వారిని ప్రాణాలతో వదిలేసి వెళ్లిపోయారు. తీవ్రగాయాలైన కాలేజ్ అమ్మాయి, ఆమె స్నేహితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రసిద్ది చెందిన పుణ్యక్షేత్రంలో కాలేజ్ అమ్మాయి మీద ఆరు మంది గ్యాంగ్ రేప్ జరగడంతో హోమ్ మంత్రి స్వయంగా రంగంలోకి దిగి కేసు వివరాలు సేకరించారు. కాలేజ్ అమ్మాయి గ్యాంగ్ రేప్ కేసు విచారణకు ప్రత్యేక పోలీసు అధికారులను నియమించామని, నేను సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలిస్తానని హోమ్ మంత్రి మీడియాకు చెప్పారు.

ప్రపంచ ప్రసిద్ది చెందిన మైసూరు నగరం
కర్ణాటకలోని మైసూరుకు రాచనగరి అని పేరు ఉంది. మైసూరు పేరు చెబితే ప్రపంచం మొత్తం గుర్తు వచ్చేది మైసూరు దసరా ఉత్సవాలు. ప్రపంచ వ్యాప్తంగా దేశ విదేశాల నుంచి మైసూరు దసరా ఉత్సవాలకు లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు. అలాంటి మైసూరు నగరం సమీపంలో ప్రముఖ పుణ్యక్షేత్రం చాముండేశ్వరి కొండ ఉంది. చాముండేశ్వరి కొండ మీద అమ్మవారు కొలువై ఉన్నారు.

బాయ్ ఫ్రెండ్ తో వెళ్లిన కాలేజ్ అమ్మాయి
ప్రపంచ ప్రసిద్ది చెందిన రాచనగరి మైసూరు సమీపంలోని ప్రసిద్ది చెందిన పుణ్యక్షేత్రం చాముండికొండ సమీపంలో దారుణంగా జరిగింది. మైసూరులోని ఓ ప్రముఖ కాలేజ్ లో చదువుకుంటున్న యువతి, ఆమె స్నేహితుడు మంగళవారం సాయంత్రం బైక్ లో చాముండికొండ మీదకు వెళ్లి అక్కడి పుణ్యక్షేత్రంలో అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం చేసుకున్న తరువాత బైక్ లో కొండ దిగుతున్న సమయంలో కాలేజ్ విద్యార్థిని, ఆమె స్నేహితుడు మార్గం మద్యలో చాముండితప్ప సమీపంలోని లలితాద్రిపురంలో రోడ్డు పక్కన నిలబడి ఉన్నారు.

కాపుకాసిన కామాంధులు
లలితాద్రిపురంలో ఉన్న సమయంలో ఆరు మంది కామాంధులు ఒక్కసారిగా విరుచుకుపడి కాలేజ్ అమ్మాయి, ఆమె స్నేహితుడి మీద దాడి చేశారు. ఇద్దరినీ పుణ్యక్షేత్రం కొండ సమీపంలోని లలితాద్రిపురంలోని నిర్జనప్రదేశంలోకి లాక్కొని వెళ్లారు. అమ్మాయి స్నేహితుడిని బండరాయితో దాడి చేసి చితకబాదేశారు. తరువాత కాలేజ్ అమ్మాయిని నిర్జనప్రదేశంలోని లాక్కొని వెళ్లారు.

ఫ్రెండ్ ను కట్టేసి ఆరు మంది గ్యాంగ్ రేప్
కాలేజ్ అమ్మాయి స్నేహితుడిని అక్కడ కట్టేశారు. రాత్రి పూట జనసంచారం తక్కువగా ఉండటంతో కామంధులు రెచ్చిపోయారు. కాలేజ్ అమ్మాయి మీద ఒకరి తరువాత ఒకరు ఆరు మంది సామూహిక అత్యాచారం చేసి రాక్షసుల్లా వారి కామం తీర్చుకున్నారు. కాలేజ్ అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేసిన కామాంధులు ఆ విషయం పోలీసులకు ఫిర్యాదు చేసినా, బయట ఎవరికైనా చెప్పినా మిమ్మల్ని ఇద్దర్నీ చంపేస్తామని బెదిరించి వార్నింగ్ ఇచ్చి వారిని ప్రాణాలతో వదిలేసి వెళ్లిపోయారు.

హోమంత్రి ఎంట్రీ
తీవ్రగాయాలైన కాలేజ్ అమ్మాయి, ఆమె స్నేహితుడు మైసూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రసిద్ది చెందిన పుణ్యక్షేత్రంలో కాలేజ్ అమ్మాయి మీద ఆరు మంది గ్యాంగ్ రేప్ చెయ్యడంతో కర్ణాటక హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర స్వయంగా రంగంలోకి దిగి కేసు వివరాలు సేకరించారు.

ఎవ్వరినీ వదిలిపెట్టం
చాముండికొండ మీద కాలేజ్ అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేశారని తమకు సమాచారం అందిందని, బెంగళూరు నుంచి ప్రత్యేక పోలీసు అధికారులను మైసూరుకు పంపించి కేసు విచారణ చేయిస్తున్నామని, అమ్మాయి మీద రేప్ చేసిన వారిని ఎవ్వరిని వదిలిపెట్టమని, చట్టపరంగా అందరిని శిక్షిస్తామని కర్ణాటక హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర బుధవారం బెంగళూరులో మీడియాకు చెప్పారు.

ఇంకా ఎవ్వరూ అరెస్టు కాలేదు
మైసూరు కాలేజ్ అమ్మాయి గ్యాంగ్ రేప్ కేసులో ఇంకా ఎవ్వరిని పోలీసులు అరెస్టు చెయ్యలేదని కర్ణాటక హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర అన్నారు. ఇప్పటికే డీసీపీ ప్రదీప్ గుంటి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. చాముండికొండ మీదకు మంగళవారం రాత్రి ఎవరెవరు వెళ్లారు అని పోలీసు అధికారులు కూపీలాగుతున్నారు.












Click it and Unblock the Notifications