Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Company MD: లేడీ సెక్రటరీకి క్యాబిన్ లో బెడ్ రూమ్, సీక్రెట్ కెమెరాలతో సినిమా, స్టాఫ్ స్కెచ్, అపర్ణ !

ఘాజియాబాద్/లక్నో/చెన్నై: భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్న భర్త బయట అమ్మాయిలు, ఆంటీలతో ఎంజాయ్ చేస్తున్నాడు. కంపెనీలు, ఫ్యాక్టరీలు నిర్వహిస్తున్న ఆ వ్యాపారవేత్త అతనికి నచ్చినట్లు జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంట్లో భార్యకు మంచి బెడ్ రూమ్ ఇచ్చిన వ్యాపారవేత్త కంపెనీలోని అతని క్యాబిన్ లో లేడీ సెక్రటరీ, పర్సనల్ ప్రియురాలికి మాస్టర్ బెడ్ రూమ్ ఏర్పాటు చేశాడు. ఫ్యాక్టరీలోకి ఎంట్రీ ఇచ్చిన లేడీ సెక్రటరీ తరువాత బాస్ తో రొమాన్స్ జీవితం మొదలైపోతుంది. ఈ విషయం తెలుసుకున్న ఉద్యోగులు బాస్ క్యాబిన్ లో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేశారు. బాస్, ఆయన సెక్రటరీ కంపెనీలో రొమాన్స్ చేస్తున్న సమయంలో ఆ సీన్లు రికార్డు చేశారు. మహిళా ఉద్యోగినితో నగ్నంగా ఎంజాయ్ చేస్తున్న బాస్ వీడియోలు సంపాధించుకున్న ఉద్యోగులు తరువాత అతనికి సిల్వర్ స్క్రీన్ లేకుండానే సినిమా చూపించారు. బాస్ తో ఎంజాయ్ చేసిన కిలాడీ లేడీ సెక్రటరీతో సహ ముగ్గురు ఉద్యోగులు ఏకంగా రూ. 25 లక్షలు ఇవ్వకపోతే నువ్వు నగ్నంగా పరాయి మహిళతో ఎంజాయ్ చేస్తున్న వీడియోలను న్యూస్ చానల్ లో ప్రసారం చేస్తామని బ్లాక్ మెయిల్ చెయ్యడంతో అసలు కథ మొదలైయ్యింది.

వ్యాపారవేత్త

వ్యాపారవేత్త

ఉత్తరప్రదేశ్ లోని ఘాజియాబాద్ లో నివాసం ఉంటున్న రంజిత్ రాయ్ (పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తి అనేక వ్యాపారాలు చేస్తున్నాడు. ఘాజియాబాద్ లోని హిండన్ విహార్ ప్రాంతంలో రంజిత్ రాయ్ ఓ పెద్ద ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నాడు. హిండన్ ఏరియలోని ఫ్యాక్టరీలో చాలా మంది ఉద్యోగులు, కార్మికులు పని చేస్తున్నారు.

 లేడీ సెక్రటరీ అపర్ణ అదుర్స్

లేడీ సెక్రటరీ అపర్ణ అదుర్స్

రంజిత్ రాయ్ కంపెనీలో అపర్ణ త్యాగి అలియాస్ అపర్ణ అని అందమైన మహిళ ఉద్యోగం చేస్తున్నది. ఇదే కంపెనీలో రంజిత్ రాయ్ కి ఇంతకాలం అంకిత్, అరుణ్ ఘోష్ అనే ఇద్దరు చాలా నమ్మకంగా పని చేస్తున్నాడు. అపర్ణ త్యాగి చూడటానికి ఎర్రగా, సన్నగా పొడుగ్గా సినిమా హీరోయిన్ లా ఉంటోంది. రంజిత్ రాయ్ తన పర్సనల్ సెక్రటరిగా అపర్ణను అపాయింట్ చేసుకున్నాడు.

భార్యకు బెడ్ రూమ్.... ప్రియురాలికి మాస్టర్ బెడ్ రూమ్

భార్యకు బెడ్ రూమ్.... ప్రియురాలికి మాస్టర్ బెడ్ రూమ్

కిలాడీ లేడీ అపర్ణ ఆమె బాస్ రంజిత్ రాయ్ కు వలవేసింది. జీతం ఇస్తున్న రంజిత్ రాయ్ కూడా అపర్ణ మీద మనుసుపడ్డాడు. అంతే అక్కడ అసలు సినిమా మొదలైయ్యింది. పర్సనల్ క్యాబిన్ లో ప్రియురాలు అపర్ణకు అవసరమైన అన్ని సదుపాయాలతో మాస్టర్ బెడ్ రూమ్ టైపులో ఆ క్యాబిన్ రెడీ అయిపోయింది.

సీటు అక్కడే.... రూట్ మార్చేసిన లేడీ సెక్రటరీ

సీటు అక్కడే.... రూట్ మార్చేసిన లేడీ సెక్రటరీ

తన సీటులో కుర్చుని పనిచెయ్యడం మానేసిన అపర్ణ బాస్ రంజిత్ రాయ్ క్యాబిన్ లోకి వెళ్లి అతనితో రొమాన్స్ చెయ్యడం మొదలుపెట్టింది. ఉదయం ఆఫీసులోకి ఎంట్రీ ఇస్తున్న అపర్ణ సాయంత్రం ఇంటికి బయలుదేరే వరకు బాస్ ఏమడిగినా సరే అతని క్యాబిన్ లో ఇచ్చేసింది. క్యాబిన్ నే తన బెడ్ రూమ్ గా మార్చేసుకున్న రంజిత్ రాయ్ ఇంతకాలం పిచ్చపాటిగా అపర్ణతో ఎంజాయ్ చేస్తూ జీవితం జల్సా చేశాడు.

క్యాబిన్ లో సీక్రెట్ కెమెరాలు..... నగ్న వీడియోలతో షాక్

క్యాబిన్ లో సీక్రెట్ కెమెరాలు..... నగ్న వీడియోలతో షాక్

ఇటీవల అకింత్ అతని బాస్ రంజిత్ రాయ్ క్యాబిన్ లోకి వెళ్లి మొబైల్ లో కొన్ని వీడియో చూపించాడు. అపర్ణతో తాను నగ్నంగా క్యాబిన్ లో ఎంజాయ్ చేస్తున్న వీడియోలు చూసిన రంజిత్ రాయ్ మైండ్ బ్లాక్ అయ్యింది. తన క్యాబిన్ లోనే తనకు తెలీకుండా సీక్రెట్ కెమెరాలు (spy camera)లు ఏర్పాటు చేశారని తెలుసుకున్న రంజిత్ రాయ్ ఆందోళనకు గురైనాడు.

రూ. 25 లక్షలకు బాస్ నే బ్లాక్ మెయిల్

రూ. 25 లక్షలకు బాస్ నే బ్లాక్ మెయిల్

మీరు అపర్ణతో నగ్నంగా ఎంజాయ్ చేస్తున్న వీడియోలు బయటకు రాకుండా ఉండాలంటే మాకు రూ. 25 లక్షలు ఇవ్వాలని అంకిత్, అరుణ్ ఘోష్ అతని బాస్ రంజిత్ రాయ్ ని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో క్యాబిన్ లోకి ఎంట్రీ ఇచ్చిన అపర్ణ మీరు ఈ డీల్ కు ఒప్పుకోకపోతే తన కాపురం కూలిపోతుందని, నా భర్త కేసు పెడితే మనం ఇద్దరూ జైలుకు వెళ్లాలని నాటకాలు ఆడింది. చివరికి రూ. 10 లక్షలు ఇవ్వడానికి కంపెనీ ఎండీ రంజిత్ రాయ్ అంగీకరించాడు.

 అప్పడం చూపించిన అపర్ణ

అప్పడం చూపించిన అపర్ణ

తన నగ్న వీడియోలు ఉద్యోగుల దగ్గర ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే అని బావించిన రంజిత్ రాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంజిత్ రాయ్ నుంచి రూ. 10 లక్షలు డబ్బులు తీసుకుంటున్న అంకిత్, అరుణ్ ఘోష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన బాస్ రంజిత్ రాయ్ క్యాబిన్ లో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చెయ్యాలని అపర్ణ త్యాగినే ప్లాన్ వేసిందని నిందితులు అంకిత్, అరుణ్ నేరం అంగీకరించారని పోలీసు అధికారిన నీరజ్ సింగ్ మీడియాకు చెప్పారు.

Recommended Video

    Biological-E's Covid Vaccine తో రూ. 1500 కోట్ల డీల్ | 30 Crore Doses | Hyderabad || Oneindai Telugu
    గ్యాంగ్ స్టర్ లైఫ్ స్టైల్లో ఉద్యోగుల స్కెచ్

    గ్యాంగ్ స్టర్ లైఫ్ స్టైల్లో ఉద్యోగుల స్కెచ్

    బాస్ రంజిత్ వీక్నెస్ తెలుసుకున్న అపర్ణ ఆయనతో సరసాలు ఆడుతూ నమ్మకంగా ఉంటూ సీక్రెట్ కెమెరాలు క్యాబిన్ లో పెట్టించిందని, తరువాత బాస్ ను బ్లాక్ మెయిల్ చేసి వచ్చిన డబ్బును అందరూ పంచుకోవాలని అపర్ణ త్యాగి, అంకిత్, అరుణ్ ఘోష్ స్క్ చ్ వేశారని సీనియర్ పోలీసు అధికారి నీరజ్ సింగ్ మీడియాకు చెప్పారు. ఉత్దరప్రదేశ్ గ్యాంగ్ స్టర్ స్టర్ బవానా గురించి పూర్తి సమాచారం తెలుసుకుని అతను ఎలా బ్లాక్ మెయిల్ చేసేవాడో అని టీవీల్లో పత్రికల్లో సమాచారం తెలుసుకుని కంపెనీ ఎండీని బ్లాక్ మెయిల్ చేశారని పోలీసు అధికారులు చెప్పారని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+