Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ నెక్లెస్ పెట్టుకున్నందుకు నటి తాప్సీపై ఫిర్యాదు!!

బాలీవుడ్ నటి తాప్సీ పన్నుపై కేసు నమోదు చెయ్యాలని ఫిర్యాదు దాఖలైంది. హిందువుల మతపరమైన మనోభావాలను బాలీవుడ్ నటి తాప్సీ దెబ్బతీశారంటూ బిజెపి ఎమ్మెల్యే మాలిని కుమారుడు ఏకలవ్య సింగ్ గౌర్ నటి తాప్సి పై ముంబైలోని ఛత్రపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలీవుడ్ నటి తాప్సీ పన్ను ఇటీవల జరిగిన ఒక ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ సందర్భంగా ధరించిన దుస్తులతోపాటు లక్ష్మీదేవి పెండెంట్ ఉన్న నెక్లెస్ ను ధరించడాన్ని ఆయన తప్పు పట్టారు.

నటి తాప్సీ పన్ను ఓ మతాన్ని, సనాతన ధర్మాన్ని కించపరిచేలా శరీరం అంతా కనిపించేలా వస్త్ర ధారణ చెయ్యటంతో పాటు లక్ష్మీదేవి పెండెంట్ ఉన్న నెక్లెస్ ను ధరించారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అసభ్యమైన వస్త్రధారణతో లక్ష్మీదేవి పెండెంట్ ఉన్న నెక్లెస్ ను ఆమె ధరించిన తీరు అభ్యంతరకరమన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ముంబైలోని చత్రపుర పోలీస్ స్టేషన్లో బాలీవుడ్ నటి తాప్సీ పన్నుపై ఫిర్యాదు చేశారు.

Complaint against actress Taapsee for wearing a necklace!!

మార్చ్ 12వ తేదీన ముంబైలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ వాక్ సందర్భంగా తాప్సీ లక్ష్మీదేవి పెండెంట్ ను ధరించి కనిపించారు. దీనిపై తాప్సీ పన్ను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ కూడా పెట్టారు. ఎర్రటి లాంగ్ ఫ్రాక్ లో తాప్సీపన్ను ఈ నెక్లెస్ ధరించి కనిపించారు. దీనిపై శరీరమంతా కనిపించేలా దుస్తులు ధరించి తాప్సీ పన్ను లక్ష్మీదేవి నెక్లెస్ ను ధరించడం హిందూ ధర్మాన్ని అవమానించటం అంటూ ఏకలవ్య గౌడ్ తాప్సి పై ఫిర్యాదు చేశారు.

అయితే దీనిపై ఛత్రపుర ఇన్స్పెక్టర్ కపిల్ శర్మ ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, ఇచ్చిన ఫిర్యాదు పై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. హిందూ రక్షక్ అనే సంస్థను ఏకలవ్య సింగ్ గౌర్ నిర్వహిస్తున్నారు. గతంలో ఏకలవ్య సింగ్ గౌర్ మునావర్ ఫరూఖీపై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కమెడియన్ మునావర్ ఫారూఖీని పోలీసులు అరెస్టు చేశారు. ఇది 2021 జనవరి ఒకటవ తేదీన జరిగింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+