40 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఎవరంటే: రంగంలోకి పన్నీర్ !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళ రాజకీయం రసవత్తర మలుపులు తిరుగుతోంది. గోల్డెన్ బే రిసార్ట్ లో ఉన్న అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామిపై తిరుగుబాటు చేసి ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించడంతో శశికళ వర్గం హడలిపోయింది.

శశికళ ప్లాన్ రివర్స్: జైల్లో మరో గదికి, తమిళనాడు వెళ్లాలని ! ఎందుకంటే ?

ఏదోవిధంగా అసమ్మతి ఎమ్మెల్యేలను తమ దారికి తెచ్చుకోవాలని శశికళ వర్గం ప్రయత్నాలు మొదలుపెట్టింది. రిసార్ట్ లోని దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు ఎదురుతిరిగారని తెలుసుకున్న పన్నీర్ సెల్వం వర్గంలో ఆశలు చిగురించాయి.

రిసార్ట్ లో 40 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు: కాళ్లు పట్టుకుంటాం, పరుగో పరుగు!

అంతే వెంటనే పన్నీర్ సెల్వం వర్గీయులు రంగంలోకి దిగారు. రిసార్ట్ లో ఉన్న అసమ్మతి ఎమ్మెల్యేలు ఎవరు ? అని గుట్టుచప్పుడు కాకుండా ఆరా తీస్తున్నారు. అసమ్మతి ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులతో సంప్రదించి వారిని తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.

పక్కా ప్లాన్ తో పన్నీర్ సెల్వం

పక్కా ప్లాన్ తో పన్నీర్ సెల్వం

పన్నీర్ సెల్వం చెన్నై నుంచి చక్రం తిప్పుతున్నారు. ఇప్పటికే తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి అత్యవసర సమావేశం నిర్వహించి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటూ వారితో చర్చలు మొదలు పెట్టారు.

న్యాయనిపుణులో చర్చించి

న్యాయనిపుణులో చర్చించి

పన్నీర్ సెల్వం శుక్రవారం మద్నాహ్నం న్యాయనిపుణలతో చర్చించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మేము ఏం చెయ్యాలి అంటూ న్యాయనిపుణుల సలహాలు సూచనలు తీసుకుంటున్నారు. శశికళ వర్గం ఎత్తులకు పన్నీర్ సెల్వం పైఎత్తులు వేస్తున్నారు.

శశికళను దెబ్బ కొట్టడానికి ఇదే మంచి సమయం

శశికళను దెబ్బ కొట్టడానికి ఇదే మంచి సమయం

అసమ్మతి ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకుని శశికళ వర్గం ప్రభుత్వాన్ని కుప్పకూల్చేయడానికి ఇదే మంచి సమయం అని పన్నీర్ సెల్వం వర్గం భావించింది. ఏ ఒక్క అవకాశం చేయ్యిజారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

రంగంలోకి మాజీ డీజీపీ నటరాజ్

రంగంలోకి మాజీ డీజీపీ నటరాజ్

శాంతిభద్రతలకు సమస్యలు ఎదురుకాకుండా శశికళ వర్గంపై ప్రత్యక్షంగా పోరాటం చెయ్యడానికి పన్నీర్ సెల్వం సిద్దం అయ్యారు. మాజీ డీజీపీ మైలాపూర్ ఎమ్మెల్యే నటరాజ్ తో పన్నీర్ సెల్వం చర్చించారు. అమ్మ ఫోటో పెట్టుకుని గెలిచిన మనం ఇప్పుడు అమ్మ సెంటిమెంట్ తో నే శశికళ వర్గాన్ని దెబ్బ తియ్యాలని నిర్ణయించారు.

రంగంలోకి జయమేనకోడలు దీపా

రంగంలోకి జయమేనకోడలు దీపా

అసమ్మతి ఎమ్మెల్యేలతో చర్చలు జరిపే సమయంలో జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ మద్దతు తీసుకోవాలని పన్నీర్ సెల్వం వర్గం నిర్ణయించింది. అమ్మ సెంటిమెంట్ ను దీపాతోనే ఎమ్మెల్యేల మీద ప్రయోగించాలని ప్రయత్నిస్తున్నారు.

మమ్మల్ని చులకనగా చూస్తారా !

మమ్మల్ని చులకనగా చూస్తారా !

రిసార్ట్ లో ఉన్న దళిత సామాజిక వర్గానికి చెందిన 28 మంది, ఆరు మంది వన్నీయర్లతో సహ మొత్తం 40 మంది ఎమ్మెల్యేలు శశికళ వర్గంపై తిరుగుబాటు చేస్తున్నారని సమాచారం. ఆ ఎమ్మెల్యేలతో ఎలాగైనా సంప్రదించాలని, అవసరం అయితే గవర్నర్ ను కలిసి పరిస్థితి వివరిస్తామని పన్నీర్ సెల్వం వర్గీయులు అంటున్నారు. మొత్తం మీద ఎడప్పాడి పళనిసామికి ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Confusing situation arise in AIADMK as two faction executives sacks each other.
Please Wait while comments are loading...