కాంగ్రెస్ కీలక నియామకాలు- తెలుగు రాష్ట్రాల్లో ట్విస్టులు-రేవంత్ క్లాస్ మేట్ కు..!

కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, పార్టీ విభాగాలకు పలువురు పార్టీ నాయకులను ఏఐసీసీ కార్యదర్శులుగా కాంగ్రెస్ (Congress)అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నియమించారు. ఇప్పటికే బాధ్యతల్లో ఉన్న పలువురికి కొత్త బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కమ్యూనికేషన్, మీడియా, సోషల్ & డిజిటల్ మీడియా, అడ్మినిస్ట్రేషన్, ట్రైనింగ్ & సందేశ్, విదేశీ వ్యవహారాలు తదితర విభాగాలకు బాధ్యతలను కేటాయించారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.

కాంగ్రెస్ మళ్లీ గెలవదు-నేనూ పోటీ చేయను- మంత్రి తుమ్మల హాట్ కామెంట్స్..!
కాంగ్రెస్ మళ్లీ గెలవదు-నేనూ పోటీ చేయను- మంత్రి తుమ్మల హాట్ కామెంట్స్..!

ఈ మార్పుల్లో భాగంగా తెలంగాణ నుంచి ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను ఈసారి తప్పించారు. రేవంత్ రెడ్డి మాజీ క్లాస్ మేట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డికి కూడా క్లాస్ మేట్ అయిన జెట్టి కుసుమకుమార్ ను ఒడిశా నుంచి ఏఐసీసీ కార్యదర్శిగా నియమించారు. అలాగే తెలంగాణకు సచిన్ సావంత్, సిమోన్ అలెక్స్ శరణ్ ను నియమించారు. కర్నాటకకు తెలంగాణ నేత సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీని ఏఐసీసీ కార్యదర్శిగా నియమించారు. అలాగే ట్రైనింగ్ అండ్ సందేశ్ విభాగంలో మరో తెలంగాణ నేత కోల్కొండ సంతోష్ ను నియమించారు. ఆంధ్రప్రదేశ్ కు సెంథమిల్ అరసు, వి. శంకర్ ను ఏఐసీసీ కార్యదర్శులుగా నియమించారు. అలాగే ఏపీకి చెందిన కాంగ్రెస్ నేత జంగా గౌతమ్ ను తమిళనాడు, పాండిచ్చేరికి ఏఐసీసీ కార్యదర్శిగా నియమించారు.

Congress Announces New AICC Secretaries Key Changes in Telugu States Revanth s Ex-Classmate get Odisha
భారత్-పాకిస్తాన్ చర్చలు సాధ్యమే.. కానీ.. తేల్చేసిన రాహుల్ గాంధీ..!
భారత్-పాకిస్తాన్ చర్చలు సాధ్యమే.. కానీ.. తేల్చేసిన రాహుల్ గాంధీ..!

మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు ఉండటం, అలాగే ఈ రెండేళ్లలోనే దాదాపు 10 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండటంతో ఆ మేరకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు వీలుగా కాంగ్రెస్ ఈ నియామకాలు చేపట్టింది. ఇప్పటికే జాతీయ స్ధాయిలో ఎన్డీయే కూటమిపై అలుపెరగని పోరాటాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ.. ఇండియా కూటమికి నాయకత్వం వహించే స్దాయిలో ఉన్నారు. దీంతో రాష్ట్రాల్లోనూ మరింత బలపడితే వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడం అంత కష్టమేమీ కాబోదని రాహుల్ గాంధీ అంచనా వేస్తున్నారు. దీంతో త్వరలో మరిన్ని మార్పులు చేర్పులు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+