Delhi Election Results 2025: కాంగ్రెస్ అభ్యర్థుల్లో 67 మంది డిపాజిట్లు గల్లంతు.. ఆ ముగ్గురు మాత్రమే..!

Delhi Election Results 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించింది. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ మరోసారి తుడిచిపెట్టుకుపోయింది. ఈ సారి కూడా కాంగ్రెస్ కనీసం ఖాతా తెరవలేకపోయింది. 70 నియోజకవర్గాలున్న ఢిల్లీలో కాంగ్రెస్ వరుసగా మూడో సారి కూడా ఖాతా ఓపెన్ చేయలేదు. అయితే కాంగ్రెస్ ఓట్ షేరింగ్ లో స్వల్ప మెరుగుదల కనిపించింది. చాలా మంది ప్రముఖ నాయకులు ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నారు. ఆ పార్టీ అభ్యర్థుల్లో ఎక్కువ మంది డిపాజిట్లు కోల్పోయారు. కేవలం ముగ్గురు అభ్యర్థులు మాత్రమే డిపాజిట్లు కాపాడుకోగలిగారు. వారిలో కస్తూర్బా నగర్ నుంచి అభిషేక్ దత్ రెండో స్థానంలో నిలిచిన ఏకైక కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నారు. డిపాజిట్ దక్కించుకున్న కాంగ్రెస్ నేతల జాబితాలో నంగ్లోయ్ జాట్ నుంచి రోహిత్ చౌదరి, బద్లి నుంచి దేవేంద్ర యాదవ్ ఉన్నారు.

కాంగ్రెస్ అభ్యర్థులలో ఎక్కువ మంది బీజేపీ లేదా ఆప్ తర్వాతే మూడో స్థానంలో ఉన్నారు. కానీ కొన్ని స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థుల కంటే కూడా వెనుకబడి ఉండడం గమనార్హం. ఇందులో ముస్లిం మెజారిటీ ప్రాంతాలు కూడా ఉన్నాయి. బద్లి సీటు నుంచి పోటీ చేసిన ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్ కూడా మూడో స్థానంలో నిలిచారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కల్కాజీ నియోజకవర్గంలో మూడో స్థానంలో ఉండగా.. మాజీ మంత్రి హరూన్ యూసుఫ్ 1993 నుంచి 2013 మధ్య ఐదు సార్లు ప్రాతినిధ్యం వహించిన బల్లిమారన్ లో మూడో స్థానంలో ఉన్నారు.

Congress Candidates Lost Deposits in 67 out 70 Seats in Delhi Results

10 శాతం తగ్గిన ఆప్ ఓట్లు
కాంగ్రెస్ ఓట్ల వాటాలో పెరుగుదల ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ నష్టాలను కలిగించింది. ఎస్సీలు, ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కాంగ్రెస్ భారీ నష్టాలను చవిచూసింది. అక్కడ కాంగ్రెస్ ఆప్ ను పణంగా పెట్టి స్వల్పంగా ఎక్కువగా ఓట్లను సాధించగా.. బీజేపీ లాభపడింది. ఈ ఎన్నికల్లో ఆప్ ఓట్ల వాటా 10 శాతం తగ్గింది. ఆప్ కు 43.19 శాతం ఓట్లు రాగా.. 2020 ఎన్నికల్లో ఆప్ 53.6 శాతం ఓట్ల వాటాను పొందింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల వాటాలో 2.1 శాతం మెరుగుదల కనిపించింది కానీ ఈ ఓట్ల వాటాను సీట్లుగా మార్చలేకపోయింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 4.3 శాతం ఓట్లు రాగా.. ఈ సారి 6.39 శాతం చెల్లుబాటయ్యే ఓట్లు వచ్చాయి. 2008లో కాంగ్రెస్ ఓట్ల వాటా 40.31 శాతం కాగా.. 2013లో 24.55, 2015లో 9.7, 2020లో 4.3 శాతం.. ఇలా పడిపోతూ వచ్చింది. కానీ ఈ సారి కాస్త ఓట్ల వాటా పెరగడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+