Exit Poll: ఎగ్జిట్ పోల్స్ చర్చలకు కాంగ్రెస్ దూరం.. బీజేపీకి ఇదే ఆయుధం; అమిత్ షా ఏమన్నారంటే!!
నేడు లోక్ సభ చివరి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ ముగిశాక ఆరున్నర గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేయవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్న వేళ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
ఎగ్జిట్ పోల్స్ చర్చలకు దూరంగా.. కాంగ్రెస్ నిర్ణయం.. బీజేపీకి ఆయుధం
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏవైనా సరే టీవీ ఛానల్స్ లో నిర్వహించే డిబేట్ లలో పాల్గొనకూడదని కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎగ్జిట్ పోల్స్ చర్చలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న బిజెపికి ఆయుధంగా మారింది. ఎగ్జిట్ పోల్స్ డిబేట్ లకు తాము దూరంగా ఉండబోతున్నామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా ఈ మేరకు ప్రకటన చేశారు. దీంతో ఎగ్జిట్ పోల్స్ చర్చలకు కాంగ్రెస్ దూరంగా ఉండటం బిజెపికి అస్త్రం అయింది.

కాంగ్రెస్ నిర్ణయంపై అమిత్ షా ఎద్దేవా
బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బిజెపి అగ్రనేత కేంద్ర మంత్రి అమిత్ షా దీనిపై స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ డిబేట్ లకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ నిర్ణయం వెనుక బలమైన కారణం ఉందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈసారి కూడా కాంగ్రెస్ భారీ ఓటమి ఎదుర్కోబోతున్నట్టు కాంగ్రెస్ పార్టీకి తెలుసని, మీడియా, ప్రజలకు ఏ ముఖం చూపిస్తారు.. అంటూ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ కు అమిత్ షా కీలక సూచన
అందుకే కాంగ్రెస్ పార్టీ ఎగ్జిట్ పోల్స్ కు దూరంగా పారిపోతుంది అని అమిత్ షా వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీకి ఒక కీలక సూచన కూడా చేశారు. ఎగ్జిట్ పోల్స్ కు దూరంగా కాంగ్రెస్ పార్టీ పారిపోవద్దని, ఓటమిని ఎదుర్కొని, ఆత్మ పరిశీలన చేసుకోవాలని తను చెప్పదలుచుకున్నానని అమిత్ షా పేర్కొన్నారు.
కాంగ్రెస్ పై జేపీ నడ్డా సెటైర్లు
ఇక ఇదే సమయంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఎగ్జిట్ పోల్స్ చర్చలకు కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉండాలనే నిర్ణయాన్ని తప్పుపట్టారు. దేశంలో పురాతన పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ చిన్నపిల్లల మాదిరిగా ప్రవర్తించడం తగదన్నారు. తాను ఆడుకునే బొమ్మలు ఎవరో లాగేసుకున్న తీరుగా హస్తం పార్టీ ధోరణి ఉందని ఆయన ఎద్దేవా చేశారు.
బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయనే కాంగ్రెస్ పలాయనం
అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నుండి ఒక నిర్దిష్ట సాయి పరిపక్వతను తాము ఆశిస్తున్నట్టు జేపీ నడ్డా పేర్కొన్నారు. బిజెపికి అనుకూలంగా ఫలితాలు వస్తాయన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఎగ్జిట్ పోల్స్ కు దూరంగా జరుగుతుందని జేపీ నడ్డా అభిప్రాయం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications