కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ నామినేషన్, రికార్డ్ సృష్టించిన సోనియా గాంధీ

Posted By:
Subscribe to Oneindia Telugu
  Rahul Gandhi files nomination for Congress president's post

  న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియ జరిగింది. సీనియర్ నేతల సమక్షంలో ఆయన నామినేషన్ వేశారు. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ తదితర నేతలు ఆయనను ప్రతిపాదించారు. 4 సెట్లపై 40 మంది సంతకాలు చేశారు.

  ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. రాహుల్ గాంధీకి ఎవరూ పోటీ లేనందున ఆయనను ఈ రోజే అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశముంది. ఈ కార్యక్రమానికి ఏపీ, తెలంగాణలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలు తరలి వచ్చారు. నెహ్రూ కుటుంబంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ ఆరో వ్యక్తి.

  Congress Election: Rahul Gandhi Files Nomination for Top Post

  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ ఇరవై ఏళ్లు కొనసాగారు. ఆ పార్టీ అధ్యక్షురాలిగా ఇంతకాలం ఉన్న వ్యక్తి ఎవరూ లేరు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆమె రికార్డు సృష్టించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Rahul Gandhi has filed the nomination for the post of Congress president, paving the way for his much-awaited elevation and setting the stage for a contest against PM Narendra Modi ahead of 2019 Lok Sabha elections.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి