వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలాంటి బోపన్న ప్రొటెం స్పీకరా?: కాంగ్రెస్, జేడీఎస్ పిటిషన్ పై రేపు సుప్రీం విచారణ

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ప్రొటెమ్ స్పీకర్ గా బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే బోపయ్యను ఎంపిక చేయడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్, జేడీఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సీనియర్ ఎమ్మెల్యేలను కాదని బోపయ్యను ఎలా నియమిస్తారని పిటిషన్ లో ప్రశ్నించాయి.

కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత దేశ్ పాండే(8సార్లు ఎమ్మెల్యే) ఉండగా బోపయ్యను ప్రొటెం స్పీకర్ గా నియమించడాన్ని తప్పు పట్టాయి. అదే సమయంలో రేపు బలనిరూపణ సందర్భంగా ఎటువంటి ఘటనలైనా చోటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి.. ఓటింగ్ వ్యవహారాన్ని వీడియో రికార్డింగ్ చేయాలని కూడా రెండు పార్టీలు సుప్రీంను కోరాయి.

అంతేకాదు, బోపయ్య గతంలో డిప్యూటీ స్పీకరుగా పనిచేసిన సమయంలో ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయని కాంగ్రెస్ గుర్తుచేస్తోంది. 2010లో ఇలాంటి పరిస్థితే ఏర్పడినప్పుడు.. బీజేపీకి 106 ఓట్లు వస్తే.. ఐదుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

Congress JDS challenges junior MLA KG Bopaiah as pro-tem speaker

ఆ తర్వాత బీజేపీ వైఖరిని నిరసిస్తూ వారు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతామని చెప్పడంతో.. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద స్పీకరుగా ఉన్న బోపయ్య వారిపై వేటు వేశారని అంటున్నారు. ఏ పార్టీకి చెందని స్వతంత్ర ఎమ్మెల్యేల మీద పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ప్రయోగించి అప్పట్లో ఆయన రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచారని ఆరోపిస్తున్నారు.

అలాంటి చరిత్ర ఉన్న స్పీకరు నుంచి ఇలాంటి సంక్షోభ సమయంలో పారదర్శకమైన పాత్రను ఎలా ఆశిస్తామని కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. యడ్యూరప్పకు కుడిభుజంగా, ఆర్ఎస్ఎస్ నేపథ్యం వచ్చిన వ్యక్తిగా ఉన్న బోపయ్యను ప్రొటెం స్పీకరుగా తప్పించి మరో సీనియర్ కి అవకాశం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Newest First Oldest First
10:27 PM, 18 May

ప్రొటెం స్పీకరుగా కేజీ బోపయ్య ఎంపికను సవాల్ చేస్తూ కాంగ్రెస్, జేడీఎస్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు రేపు ఉదయం 10.30గం.కి విచారించనుంది.
9:03 PM, 18 May

ప్రొటెం స్పీకరుగా కేజీ బోపయ్య ఎంపికను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై అత్యవసర విచారణ చేపట్టాలని కాంగ్రెస్ తరుపు న్యాయవాదులు సుప్రీం రిజిస్ట్రార్ ను కోరనున్నారు. ఈ మేరకు వారు సుప్రీం రిజిస్ట్రార్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు.

English summary
Congress-JDS in a fresh petition challenge selection of 'junior' MLA K G Bopaiah as pro-tem speaker of Karnataka Assembly contrary to the tradition of the post going to senior most MLA. It says Bopaiah's appointment is a blatant move to manipulate voting on trust motion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X