రామేశ్వర్ తో భోజనం చేసి చర్చలు జరిపిన రాహుల్ గాంధీ, ఎవరు ఆయన అంటే?
బెంగళూరు: కూరగాయల ధరల విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్య ప్రజలతో పాటు చిరు వ్యాపారులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కూరగాయల వ్యాపారి రామేశ్వర్‌ను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కలిశారు. కూరగాయల వ్యాపారి రామేశ్వర్‌తో కలిసి రాహుల్ గాంధీ భోజనం చేశారు. రాహుల్ గాంధీ రామేశ్వర్‌తో ఉన్న ఫోటోను పంచుకున్నారు.
రామేశ్వర్ జీ ఒక ఆత్మీయ వ్యక్తి ! అతనిలో, కోట్లాది మంది భారతీయుల స్నేహపూర్వక స్వభావాన్ని చూడవచ్చు అంటూ రాహుల్ గాంధీ హిందీలో ట్వీట్ చేశారు. ఆపదలు ఎదురైనప్పుడు కూడా చిరునవ్వుతో ముందుకు సాగే వారు నిజంగా 'భారత్ భాగ్య విధాతలు అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ట్విట్ చేశారు.

గతంలో ట్విటర్‌గా పిలిచే Xలో కాంగ్రెస్ ఈ చిత్రాన్ని షేర్ చేసింది. ప్రజా నాయకుడు రాహుల్ గాంధీని కలవాలనే కోరికను రామేశ్వర్ వ్యక్తం చేశారని, అందుకే రాహుల్ గాంధీని కలిశారని అందులో పేర్కొన్నారు. X లో అనేక మంది వ్యక్తులు పంచుకున్న చిత్రాలలో, రాహుల్ గాంధీ, రామేశ్వర్ ఇంట్లో భోజనం చేస్తున్న ఫోటోలు పెట్టారు. కూరగాయల వ్యాపారితో రాహుల్ గాంధీ ఆత్మీయంగా కలిసి మాట్లాడుతున్న ఫోటోలు ట్వీట్ చేశారు.
నెలరోజులుగా టమాటా ధర వంద రూపాయల మార్కును పైనే ఉంది. మార్కెట్‌లో కిలో నాణ్యమైన టమోటా ధర రూ.120 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నారు. ధరల పెంపుకు సంబంధించి ఢిల్లీ వీధుల్లో కూరగాయలు విక్రయిస్తున్న ఓ కూరగాయల వ్యాపారి రామేశ్వర్ దీనగాధ హృదయాన్ని కదిలించే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ప్రముఖ నటుడు విజయ్ వర్మ సహా పలువురు ఈ వీడియో క్లిప్‌ను షేర్ చేసి విచారం వ్యక్తం చేశారు. జూలై 20వ తేదీ ఉదయం రామేశ్వర్ అనే కూరగాయల వ్యాపారి టమోటాలు కొనుగోలు చేసేందుకు ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండికి వచ్చాడు. అయితే ధర ఎక్కువ కావడంతో కూరగాయలు కొనుక్కోలేక ఒట్టి చేతులతో ఇంటికి చేరుకున్నారు.
रामेश्वर जी एक ज़िंदादिल इंसान हैं!
— Rahul Gandhi (@RahulGandhi) August 14, 2023
उनमें करोड़ों भारतीयों के सहज स्वभाव की झलक दिखती है।
विपरीत परिस्थितियों में भी मुस्कुराते हुए मज़बूती से आगे बढ़ने वाले ही सही मायने में 'भारत भाग्य विधाता' हैं। pic.twitter.com/DjOrqzLwhj
ఇది గమనించిన యూట్యూబ్ మీడియా ప్రతినిధి భాను కుమార్ ఝా రామేశ్వర్‌తో మాట్లాడుతూ అతని కూరగాయల వ్యాపారం గురించి ఆరా తీస్తుండగా రామేశ్వర్ కన్నీరుమున్నీరు అయ్యారు. టమాటా కొనేందుకు వచ్చారా అనే ప్రశ్నకు రామేశ్వర్ సమాధానమిస్తూ టమాట కొనేందుకు తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేచి వచ్చానని, అయితే టమాటల ధర చాలా ఎక్కువగా ఉందని అన్నారు.
ఏపీఎంసీ మార్కెట్ లో కిలో టమాట రూ. రూ. 120 నుంచి రూ. 140 ఇంత ఖరీదు పెట్టి కొంటామని, కానీ మా సందుల్లో, వీధుల్లో కొంచం లాభం వస్తే చాలు అని కోసం అమ్మేందుకు వెళ్లినప్పుడు జనాలు కొనడానికి ముందుకు రాకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుందని రామేశ్వర్ అన్నారు.
అందుకే నేను టమోటాలు కొనడానికి ధైర్యం చెయ్యలేదని, ఇతర కూరగాయలు కొంటారా అని అడిగితే పైసే నహీ అంటూ కూరగాయల వ్యాపారి విలపించడంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపొతున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని రాహుల్ గాంధీ నరేంద్ర మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ వీడియోను పలువురు కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియా షేర్ చేశారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
Pawan Khera: కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సుప్రీం షాక్-తెలంగాణ హైకోర్టు బెయిల్ పై..! -
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
Kerala Elections: కేరళ పోలింగ్ పై సీక్రెట్ గా ఈసీ..! కాంగ్రెస్ డౌట్స్..! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!!












Click it and Unblock the Notifications