కరోనా బారిన పడి కాంగ్రెస్ ఎంపీ వసంతకుమార్ కన్నుమూత: ప్రధాని మోడీ, రాహుల్ దిగ్భ్రాంతి
చెన్నై: కరోనా మహమ్మారి సామాన్యుతోపాటు రాజకీయ, సినీ ప్రముఖులను కూడా వదలడం లేదు. ఇప్పటికే అనేక మంది ప్రముఖులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. చాలా మంది కోలుకోగా.. మరికొందరు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా, తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ హెచ్ వసంత కుమార్(70) కన్నుమూశారు.
కరోనా చికిత్స కోసం ఆగస్టు 10న చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన వసంతకుమార్.. ఆరోగ్యం క్షీణించడంతో శుక్రవారం సాయంత్రం మరణించారు. కన్యాకుమారి పార్లమెంట్ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న వసంతకుమార్.. గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు.

వసంత్ మరణం పట్ల కాంగ్రెస్ నేతలతోపాటు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వసంత్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వసంత్ మరణం తనను వేదనకు గురిచేసిందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఆయన ఎప్పుడు తనను కలిసినా తమిళనాడు అభివృద్ధి గురించే మాట్లాడేవారని తెలిపారు.
Saddened by the demise of Lok Sabha MP Shri H. Vasanthakumar Ji. His strides in business and social service efforts were noteworthy. During my interactions with him, I always saw his passion towards Tamil Nadu’s progress. Condolences to his family and supporters. Om Shanti. pic.twitter.com/SmuAK8ufAx
— Narendra Modi (@narendramodi) August 28, 2020
వసంత్ మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశారన్న రాహుల్ గాంధీ.. ఆయన ఎంతో ప్రజా సేవ చేశారని అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Recommended Video
వసంత కుమార్ రాజకీయ నాయకుడే కాక, పారిశ్రామికవేత్త కూడా. వసంత్ అండ్ కో పేరుతో చైన్ స్టోర్స్, వసంత్ టీవీని కూడా నిర్వహిస్తున్నారు. అంతేగాక, తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌కు ఈయన బంధువు..
The news of Kanyakumari MP, Shri H Vasanthakumar’s untimely demise due to Covid-19 has come as a shock.
— Rahul Gandhi (@RahulGandhi) August 28, 2020
His commitment to the congress ideology of serving the people will remain in our hearts forever.
Heartfelt condolences to his friends and family members. pic.twitter.com/oqhrfQXEUD












Click it and Unblock the Notifications