కరోనాతో మరో ఎంపీ మృతి -ప్రధాని మోదీ దిగ్భ్రాంతి -రాజీవ్ సతావ్ మరణం తీరని లోటన్న రాహుల్ గాంధీ

దేశంలో కరోనా వైరస్ విలయతాండవం కొనసాగుతున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం నాటి లెక్కల ప్రకారం తాజాగా 3,11,170 కొత్త కేసులు, 4,077 మరణాలు నమోదయ్యాయి. మోస్ట్ ఎఫెక్టెడ్ రాష్ట్రం మహారాష్ట్రలో వైరస్ ఉధృతి బలంగా ఉంది. ఇప్పటికే ఎంతో మంది రాజకీయ నేతలను పొట్టనపెట్టకున్న మహమ్మారి తాజాగా మరో ఎంపీని బలితీసుకుంది..

కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ, పలు కీలకమైన పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడైన రాజీవ్ సాత‌వ్(46) ఆదివారం కన్నుమూశారు. కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీకి సన్నిహితుడ‌యిన సాత‌వ్.. ఏప్రిల్ 22 న కరోనా వైరస్ బారిన పడ్డారు. అప్పటి నుంచి పూణేలోని జహంగీర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు.

Congress MP Rajeev Satav Dies Of Covid, upcoming leader says pm modi, Rahul Gandhi Big Loss

2014 సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలోని హింగోలి నుంచి గెలుపొందిన రాజీవ్ సాత‌వ్.. 2019లో ఓడిపోయినా, రాజ్యసభ ఎంపీగా సేవలు కనసాగిస్తున్నారు. ఏఐసీసీసీ కార్యదర్శిగానూ పనిచేసిన సాత‌వ్ ప్ర‌స్తుతం గుజరాత్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Congress MP Rajeev Satav Dies Of Covid, upcoming leader says pm modi, Rahul Gandhi Big Loss

కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సాతవ్ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ''రాజీవ్ చాలా సమర్థుడైన నేత, భవిష్యత్ ఆశాకిరణం లాంటి అతను కరోనాతో కన్నుమూయడం బాధాకరం'' అని మోదీ పేర్కొన్నారు. రాజీవ్ ను స్నేహితుడిగా పేర్కొంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ''నా స్నేహితుడు రాజీవ్ సాతవ్ ను కోల్పోయినందుకు బాధగా ఉంది. కాంగ్రెస్ ఆదర్శాలు మూర్తీభవించిన సమర్థ నాయకుడు అతను. పార్టీ పరంగానేకాదు, వ్యక్తిగతంగానూ నాకిది పెద్ద నష్టమే. ఆయన కుటుంబానికి నా సంతాపం'' అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+