Sonia Gandhi : సోనియా గాంధీ రిటైర్మెంట్ పై కాంగ్రెస్ పార్టీ క్లారిటీ-ప్లీనరీలో ప్రకటన..
కాంగ్రెస్ మాజీ అధినేత్రి తాజాగా చేసిన రిటైర్మెంట్ ప్రకటనపై పార్టీ అధికార ప్రతినిధి అల్కా లాంబా ఇవాళ క్లారిటీ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీని ఒకప్పుడు తన కన్నుసన్నలతో శాసించి, అనంతరం అధికారం కోల్పోయాక మౌనంగా ఉంటూ వస్తున్న ఎంపీ సోనియా గాంధీ భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ ముగిసిందంటూ చేసిన ప్రకటన రాజకీయంగా ప్రకంపనలు రేపింది. సోనియా ప్రకటనతో ఇక ఆమె రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు అంతా భావించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఇవాళ స్పష్టత ఇచ్చింది.
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరుగుతున్న మూడు రోజుల కాంగ్రెస్ 85వ ప్లీనరీ సెషన్‌లో రెండవ రోజు ప్రసంగంలో సోనియా గాంధీ తన పదవీ విరమణపై చేసిన ప్రకటన పలు ఊహాగానాలకు తావిచ్చింది. దీంతో గందరగోళానికి తెరదించేందుకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అల్కా లాంబా ఇవాళ ఓ స్పష్టమైన ప్రకటన చేశారు.
పార్టీ ప్లీనరీ సెషన్ ముగింపు రోజైన ఇవాళ అల్కా లాంబా మాట్లాడుతూ... మీడియా సోనియా గాంధీ ప్రసంగాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం మానేయాలన్నారు. ఆమె ఎప్పుడూ పదవీ విరమణ చేయలేదని, అలాగే ఎప్పటికీ రిటైర్ కానని మేడమ్ చెప్పినట్లు వెల్లడించారు.

కాంగ్రెస్ ప్లీనరీ వేదికగా అల్కా లాంబా ఈ ప్రకటన చేస్తున్నప్పుడు అక్కడే ఉన్న సోనియా గాంధీ నవ్వుతూ కనిపించారు. భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ ముగియడం సంతోషంగా ఉందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇంతకుముందు చెప్పారు. దీంతో ఆమె ఇక క్రియాశీల రాజకీయాలకు గుడ్ బై చెప్పి ఇంటిపట్టునే ఉండిపోతారని అంతా భావించారు. అలాగే భారత్ జోడో యాత్రతో క్లిక్ అయిన రాహుల్ గాంధీకి పూర్తి బాధ్యతలు అప్పగించబోతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ సోనియా ఉద్దేశం అది కాదని అర్ధమైంది.
-
YS Sharmila: జగన్ పై ముందుచూపు సరే..! చంద్రబాబుపై షర్మిల సెటైర్లు..! -
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్












Click it and Unblock the Notifications