బీజేపీ ఎంపీల్లో మగాళ్లు ఎవ్వరూ లేరా ?, మోదీని చూస్తే అంత భయమా ?, పోసుకుంటారా ?
కర్ణాటక బీజేపీలో ఎంపీలుగా మగాళ్లు ఎవ్వరూ లేరా అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక నుంచి బీజేపీ టిక్కెట్ మీద ఎంపీలుగా మగాళ్లు ఎవ్వరూ గెలవలేదా అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్‌సీ బాలకృష్ణ బీజేపీ సిట్టింగ్ ఎంపీలపై విరుచుకుపడ్డారు.కేంద్రం చూపిస్తున్న వివక్షను నిరసిస్తూ ఢిల్లీలో కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన నిరసన దీక్షపై రామనగర జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హెచ్‌సీ బాలకృష్ణ విలేకరులతో మాట్లాడారు.
పన్ను చెల్లింపులో కర్ణాటక రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో ఉందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హెస్ సీ బాలకృష్ణ అన్నారు. మాకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదని, కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు మంజూరు చెయ్యాలని కర్ణాటక ప్రభుత్వం మనవి చేసినా ఏమాత్రం పట్టించుకోలేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హెస్ సీ బాలకృష్ణ ఆరోపించారు. కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీ ముందు కూర్చోవడానికి భయపడతారని, లేచి నిలబడటానికి కూడా ఆలోచిస్తారని, బీజేపీ ఎంపీలు పేరుకే గెలిచారని, వాళ్లు వ్యక్తిగత చరిష్మా లేకుండా బతుకుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హెస్ సీ బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పొరుగున ఉన్న తమిళనాడు నాయకులు వాళ్ల హక్కుల కోసం చేస్తున్న పోరాటాన్ని చూసి కర్ణాటకలోని కొందరు నాయకులు నేర్చుకోవాలని చెప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్‌సీ బాలకృష్ణ బీజేపీ ఎంపీలుఅందరూ పైకి షో చూపిస్తారని, ఢిల్లీ వెళ్లి టీఏ, డీఏ తీసుకురావడం మాత్రమే వాళ్ల పని అని, కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీలు, కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రులు రాష్ట్రం కోసం నోరు కూడా విప్పలేని పరిస్థితుల్లో ఉన్నారని, కర్ణాటకకు రావలసిన నిధులు అడగడానికి వాళ్లకు నోరుకూడా రాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్‌సీ బాలకృష్ణ ఆరోపించారు.
కర్ణాటకకు రావలసిన నిధులు తెచ్చుకోవడానికి మేము ఢిల్లీలో పోరడటానికి సిద్దం అయ్యామని, ఇప్పటికైనా కర్ణాటకలోని బీజేపీ ఎంపీలు మగాళ్లు అయితే ఢిల్లీలో మా పోరాటానికి మద్దతు ఇస్తారని, అలా మద్దతు ఇస్తారో లేదో త్వరలో తెలిసిపోతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్‌సీ బాలకృష్ణ అన్నారు. కర్ణాటక నుంచి బీజేపీ తరపున ఎంపీలుగా గెలిచిన వాళ్లు మగాళ్లలాగా తనకు కనపడటం లేదని, పేరుకు మాత్రమే ప్రకటనలు ఇచ్చి కాలం గడిపేస్తున్నారని, కార్ణాటక ప్రజల గురించి వారికి ఏమాత్రం పట్టడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్‌సీ బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రత్యేక దేశం గురించి మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హెచ్‌సీ బాలకృష్ణ మాట్లాడారు. డీకే సురేష్ ప్రకటనను బీజేపీ వక్రీకరించిందని, కర్ణాటకకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దకుంటే ప్రత్యేక దేశం కోసం తాము ఉద్యమిస్తామని ఎంపీ సురేష్ అన్నారని, అందులో తప్పేముందని, అన్యాయం జరిగినప్పుడు నిరసన తెలపడం తప్పా ?, దాన్ని మీడియా, బీజేపీ వక్రీకరించాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్‌సీ బాలకృష్ణ ఆరోపించారు.

దేశాన్ని విభజించాలని తాము అనలేదని ఎమ్మెల్యే హెచ్‌సీ బాలకృష్ణ అన్నారు. దేశాన్ని విభజించాలనే ఉద్దేశం ఎవరికీ లేదని, దేశాన్ని నిర్మించింది కాంగ్రెస్ పార్టీయే అని కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్‌సీ బాలకృష్ణ అన్నారు. కానీ మాకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని, మాకు రావాల్సిన నిధుల గురించి చర్చించడానికి బీజేపీ నేతలు బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్‌సీ బాలకృష్ణ సవాల్ విసిరారు.
లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి బెంగళూరు రూరల్ నియోజకవర్గం నుంచి బీజేపీ, జేడీఎస్ కూటమి అభ్యర్థి కోసం అన్వేషణ చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్.సీ.బాలకృష్ణ వ్యంగంగా అన్నారు. డీకే సురేష్‌ను ఎదుర్కొనే అభ్యర్థి బీజేపీలో, జేడీఎస్ లో లేరని, లోక్‌సభ సభ్యుడు సామాన్యులతో కలిసి పని చేయగలడు అని మా సురేష్ చూపించారని, కర్ణాటక మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి, మాజీ మంత్రి యోగేశ్వర్ వచ్చి పోటీ చేసినా మా లీడర్ డీకే సురేష్ ఓడించలేరని కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్‌సీ బాలకృష్ణ ధీమా వ్యక్తం చేశారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ వార్ పై ప్రధాని సమీక్ష-చమురు, గ్యాస్, ఎరువులపై కీలక నిర్ణయాలు ? -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్.. కీలక విషయాలపై చర్చ -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు












Click it and Unblock the Notifications