Rajasthan Polls: రాజస్తాన్ రెబెల్స్ కు కాంగ్రెస్ వార్నింగ్-ఇదే లాస్ట్ ఛాన్స్..!
రాజస్తాన్ లో అధికారం నిలబెట్టుకుని చరిత్ర సృష్టించాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి స్ధానికంగా తలనొప్పులు తగ్గడం లేదు. ముఖ్యంగా ఈ నెలలో జరిగే ఎన్నికల్లో పార్టీ టికెట్లు లభించని కొందరు నేతలు రెబెల్స్ గా మారారు. వీరంతా స్వతంత్రులుగా బరిలోకి దిగడమో లేక ప్రత్యర్ధి బీజేపీ అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారం చేయడమో చేసేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తాజాగా వారికి హెచ్చరికలు పంపింది. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ సుఖ్జీందర్ సింగ్ రణ్ ధావా లేఖలు రాశారు.
పార్టీ అధికారిక అభ్యర్థికి బదులు మరే ఇతర అభ్యర్థికి మద్దతివ్వొద్దని కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ సుఖ్‌జిందర్ సింగ్ రంధవా రెబెల్స్ ను కోరారు. పార్టీ అధికారిక అభ్యర్థికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా సుఖ్‌జీందర్ సింగ్ రంధవా అధికారిక అభ్యర్థికి మద్దతు ఇవ్వడం ద్వారా పార్టీకి అనుకూలంగా ప్రచారంలో చేరాలని ఈ లేఖలో కోరారు. మరో రెండు రోజుల్లో తిరుగుబాటు అభ్యర్థులు ఎన్నికల నుంచి వైదొలగకుంటే, పార్టీ అధికారులు, సీనియర్ నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుంటే వారిపై పార్టీ చర్యలు తీసుకుంటుందని రాంధావా హెచ్చరించారు.

రాజస్తాన్లో కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేసిన దాదాపు 15-20 మంది అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారిక అభ్యర్థులకు సమస్యగా మారుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో వీరందరినీ ఎలాగైనా వెనక్కి తగ్గేలా చూసేందుకు పార్టీ అధిష్టానం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అసలే రాష్ట్రంలో బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న తరుణంలో వీరిని ఉపసంహరించలేకపోతే సమస్యలు తప్పవని అధిష్టానం భావిస్తోంది. దీంతో సామదాన భేద దండోపాయాల్ని ప్రయోగిస్తోంది.
రాజస్తాన్ అసెంబ్లీలోని 200 సీట్లకు జరిగే ఈ ఎన్నికల పోలింగ్ ఈ నెల 23న జరగాల్సి ఉంది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications