వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామాలయ నిర్మాణానికి ఎప్పుడు సానుకూలమే...ఇక బీజేపీ రాజకీయానికి డోర్లు క్లోజ్ : కాంగ్రెస్

|
Google Oneindia TeluguNews

అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. రామమందిర నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుందని, మందిర నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు సానుకూలంగానే ఉందని ఆపార్టీ సీనియర్ నేతల ఏఐసీసీ వర్కింగ్ కమీటి మెంబర్ రణ్‌దీప్‌సింగ్ సుర్జేవాలా ప్రకటించారు. ఈ నేపపథ్యంలోనే అన్ని పార్టీలు, మతాలు శాంతి సామరస్యాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఇక సుప్రిం తీర్పుతో బీజేపీ మత రాజకీయానికి డోర్లు క్లోజ్ అయినట్టేనని ఆయన వ్యాఖ్యానించారు

దశాబ్దాల వివాదానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగోయ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల బృందం ఏకగ్రీవ తీర్పును వెలువరించింది. అయోధ్య వివాద స్థలం రామ్‌న్యాస్‌కు చెందుతుందని స్పష్టం చేసింది. గుడి నిర్మాణం కోసం ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని చెప్పింది. ఇక మసీదు నిర్మాణానికి సంబంధించి అయోధ్యలోనే అయిదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది.

congress party welcomed Supreme Courts verdict on the Ram Janmbhoomi dispute

English summary
The Congress has welcomed the Supreme Court verdict on the Ram Janmbhoomi-Babri Masjid land title dispute.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X