రాజదండం స్టోరీ ఫేక్ అన్న కాంగ్రెస్- దేశ సంస్కృతిపై గౌరవం లేదంటూ బీజేపీ ఎదురుదాడి...

దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 28న జరిగే కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని ప్రధాని మోడీ చేస్తుండటంపై ఓవైపు వివాదం సాగుతుండగా.. మరోవైపు పార్లమెంటులో గతంలో తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు బ్రిటీష్ వైశ్రాయ్ ఇచ్చిన రాజదండాన్ని తిరిగి బయటికి తీసి స్పీకర్ స్ధానం పక్కన ఉంచాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం మరోవైపు కలకలం రేపుతోంది. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబడుతోంది. అసలు ఈ రాజదండానికి సంబంధించి బీజేపీ చెప్తున్న కథే ఫేక్ అంటోంది.

గతంలో బ్రిటీష్ పాలకుల నుంచి భారత్ స్వాతంత్రం తీసుకునే క్రమంలో దానికి గుర్తుగా ఏదో ఒకటి ఉండాలని భావించి రాజగోపాలచారి సూచనతో అప్పటి కాబోయే ప్రధాని నెహ్రూ ఓ రాజదండం తయారు చేయించి దాన్ని బ్రిటీష్ చివరి వైశ్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్ నుంచి దాన్ని అందుకున్నారని తాజాగా ఓ కథ ప్రచారం జరుగుతోంది. అప్పట్లో అధికార మార్పిడికి గుర్తుగా నెహ్రూ దీన్ని అందుకున్నారని, ఆ తర్వాత దీన్ని చేతికర్రగా వాడి అనంతరం మ్యూజియంలో పెట్టేశారని బీజేపీ ఆరోపిస్తోంది.

 rajadandam

ఈ వాదనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఎక్కడో మ్యూజియంలో ఉన్న రాజదండాన్ని తీసుకొచ్చి దాన్ని నెహ్రూకు అంటగట్టి బీజేపీ కట్టుకథలు ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ ఆరోపించారు. తమిళనాడులో తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రధాని, ఆయన వంది మాగధులు ఈ వాదనను తెరపైకి తెచ్చారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ విమర్శించారు. మద్రాసు ప్రావిన్స్‌లోని ఒక మఠం ద్వారా తయారు చేయించిన రాజదండం నెహ్రూకు బహుకరించారన్నారు.దీన్ని కాదని మౌంట్ బాటన్, రాజాజీ, నెహ్రూలు ఈ రాజదండాన్ని భారతదేశానికి బ్రిటీష్ అధికార బదిలీకి చిహ్నంగా అభివర్ణించటానికి ఎటువంటి ఆధారాలు లేవన్నారు.

జైరాం రమేష్ వాదనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ భారతీయ సంప్రదాయాలు, సంస్కృతిని ఎందుకు అంతగా ద్వేషిస్తుందని ప్రశ్నించారు. భారతదేశ స్వాతంత్య్రానికి ప్రతీకగా తమిళనాడుకు చెందిన పవిత్ర శైవ మఠం పండిట్ నెహ్రూకు పవిత్రమైన రాజదండాన్ని అందించిందని, దానిని 'వాకింగ్ స్టిక్'గా మ్యూజియంలో పెట్టి బహిష్కరించారని అమిత్ షా ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+