• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ జంబో లిస్ట్ - కన్నయ్య కుమార్‌కూ చోటు

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ అన్ని పార్టీలు కూడా తమ ప్రచార జోరును పెంచుకుంటోన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం కావడం వల్ల- అందరి దృష్టీ ఈ ఎన్నికలపైనే నిలిచింది. ఫలితాలు ఎలా ఉంటాయనేది ఉత్కంఠభరితంగా మారింది. రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర ప్రభావం ఎంతమేర ఉందనేది ఈ ఎన్నికలు స్పష్టం చేయనున్నాయి.

అధికారాన్ని నిలబెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ విస్తృత ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ దీనికి ఏ మాత్రం తీసిపోని విధంగా ప్రచార ఉధృతిని కొనసాగిస్తోన్నాయి. గుజరాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఇదివరకే నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 1వ తేదీన 89 సీట్లు, 5వ తేదీన మిగిలిన 93 స్థానాలకు పోలింగ్‌ను షెడ్యూల్ చేసింది.

Congress releases a list of star campaigners for Gujarat Assembly Elections 2022

మొత్తం 4,90,89,765 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అదే నెల 8వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది.
ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సమాయాత్తమౌతోంది. ఈ దఫా ఎలాగైన సరే బీజేపీ మట్టి కరిపించాలనే లక్ష్యంతో పని చేస్తోంది. అందుబాటులో ఉన్న అన్ని వనరులను కూడా వినియోగించుకోనుంది. అధినేతగా కొత్తగా బాధ్యతలను స్వీకరించిన మల్లికార్జున ఖర్గె సారథ్యంలో ఎదుర్కొంటోన్న రెండో అసెంబ్లీ ఎన్నిక ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పాగా వేసిన బీజేపీని కాంగ్రెస్ ఎలా ఓడిస్తుందనేది ఆసక్తి రేపుతోంది. ఈ పరిస్థితుల మధ్య ఏఐసీసీ తన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. జంబో లిస్ట్ ఇది. మొత్తం 40 మందికి ఇందులో చోటు కల్పించింది.

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గె, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘేల్ ఈ జాబితాలో ఉన్నారు. రమేష్ చెన్నితల, దిగ్విజయ్ సింగ్, కమల్‌నాథ్, భూపీందర్ సింగ్ హుడా, అశోక్ చవాన్, తారిఖ్ అన్వర్, బీకే హరిప్రసాద్, మోహన్ ప్రకాష్, శక్తిసిన్హ్ గోహిల్, డాక్టర్ రఘు శర్మ, జగదీష్ ఠాకూర్, సుఖ్‌రామ్ రథ్వా, సచిన్ పైలెట్, శివాజీ రావ్ మోఘె, పవన్ ఖేరా, కన్నయ్యకుమార్ ఇందులో ఉన్నారు.

English summary
Congress releases a list of star campaigners for Gujarat Assembly Elections 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X