వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యసభకు చిదంబరం - అజాద్ కు నో ఛాన్స్ : రాజ్యసభకు కాంగ్రెస్ లిస్ట్ రిలీజ్..!!

|
Google Oneindia TeluguNews

రాజ్యసభలో కాంగ్రెస్ బలం పెరగనుంది. 33 కు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్ 10న జరిగే రాజ్యసభ ఎన్నికల కు బీజేపీ - కాంగ్రెస్ తమ జాబితాతాలు విడుదల చేసాయి. అయిదులో బీజేపీకి 23 స్థానాలు దక్కనున్నాయి. దీనికి సంబంధించి తొలి జాబితా 16 మందితో విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ ఏడు రాష్ట్రాల నుంచి 10 రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. తమిళనాడు నుంచి చిదంబరం, రాజస్థాన్‌ నుంచి రణ్‌దీప్‌ సింగ్ సూర్జేవాలాలకు అవకాశం కల్పించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్​ వాస్నిక్, ఉత్తరప్రదేశ్ నేత ప్రమోద్ తివారీలను రాజస్థాన్ నుంచి పోటీకి నిలిపింది. కర్ణాటక నుంచి జైరాం రమేశ్​కు, మధ్యప్రదేశ్ నుంచి వివేక్ బంకాలను ఎంపిక చేసింది.

పార్టీలో సంస్థాగతంగా సమూల మార్పులు చేయాలంటూ 2020లో అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది సీనియర్ నేతల్లో ముకుల్ వాస్నిక్​, వివేక్ టంకాలకు ఎంపిక చేయటం ఆసక్తి కరంగా మారింది. సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కు రాజ్యసభ దక్కుతుందనే ప్రచారం సాగినా..జాబితాలో ఆయన పేరు లేకపోవటంతో ఇక ఛాన్స్ దక్కే అవకాశాలు తక్కుువగానే ఉన్నాయి. తాజా జాబితాలో..రాజీవ్ శుక్లా (చత్తీస్​గఢ్​), మాజీ ఎంపీ పప్పూ యాదవ్ సతీమణి రంజీత్ రంజన్ (బిహార్), అజయ్ మకెన్ (హరియాణా), ఇమ్రాన్ ప్రతాప్​ గర్హి (మహారాష్ట్ర)లను బరిలోకి దింపింది. ఇందులో చిదంబరం, జైరాం రమేశ్, వివేక్ టంకాలు మాత్రమే వారి సొంత రాష్ట్రాల నుంచి పోటీ చేస్తున్నారు.

Congress releases list of party candidates for the elections of Rajyasabha

పెద్దల సభలో కాంగ్రెస్‌ ప్రస్తుత బలం 29గా ఉంది. రాబోయే రెండు నెలల్లో సభలో 55 స్థానాలు ఖాళీ కానున్నాయి. ఇందులో భాగంగా హస్తం పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీలు- పి.చిదంబరం (మహారాష్ట్ర), జైరాం రమేశ్‌ (కర్ణాటక), అంబికా సోని (పంజాబ్‌), వివేక్‌ టంకా (మధ్యప్రదేశ్‌), ప్రదీప్‌ టంటా (ఉత్తరాఖండ్‌), కపిల్‌ సిబల్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌), ఛాయా వర్మ (ఛత్తీస్‌గఢ్‌) తమ పదవీకాలాన్ని పూర్తిచేసుకోనున్నారు. ఖాళీ అవుతున్న స్థానాలు..అసెంబ్లీల్లో సంఖ్య బలం చూస్తే.. పెద్దల సభలో కాంగ్రెస్‌ బలం 33కు పెరిగే ఛాన్స్ ఉంది. పి.చిదంబరం (మహారాష్ట్ర), జైరాం రమేశ్‌ (కర్ణాటక), అంబికా సోని (పంజాబ్‌), వివేక్‌ టంకా (మధ్యప్రదేశ్‌), ప్రదీప్‌ టంటా (ఉత్తరాఖండ్‌), కపిల్‌ సిబల్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌), ఛాయా వర్మ (ఛత్తీస్‌గఢ్‌) తమ పదవీకాలాన్ని పూర్తిచేసుకోనున్నారు. ఇందులో కపిల్ సిబల్ సమాజ్ వాదీ పార్టీ మద్దతుతో రాజ్యసభకు తిరిగి ఎంపిక కానున్నారు. రాష్ట్రపతి ఎన్నికల వేళ..రాజ్యసభలో పార్టీల సంఖ్యా బలం కీలకంగా మారుతోంది.

English summary
Congress announced 10 names for Rajayasabha, Chidambaram and Surjewala among the latest list.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X