Haryana Results: హర్యానాలో కాంగ్రెస్ ఓటమి వెనుక రేవంత్ - సెల్ఫ్ గోల్..!!
హర్యానాలో కాంగ్రెస్ ఆశలు ఆవిరి అయ్యాయి. గెలుపు ఖాయమనుకున్న చోట ఓటమి ఎదురైంది. ఎగ్జిట్ పోల్స్ తో పెరిగిన అంచనాలు..వాస్తవ ఫలితాల్లో తారుమారయ్యాయి. కాంగ్రెస్ హర్యానాలో ఓటమి వెనుక స్వీయ తప్పిదాలే ఎక్కువగా ఉన్నాయి. బీజేపీ గెలిచింది అనటం కంటే కాంగ్రెస్ ఓడింది అని చెప్పుకోవాల్సి వస్తోంది. పార్టీ నేతల అతి విశ్వాసం..గ్యారంటీల పైనే నమ్మకం..అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో గ్యారంటీల అమలు కష్టాలతో పాటుగా సామాజిక సమీకరణాల్లో కాంగ్రెస్ దెబ్బ తింది. ఫలితంగా బీజేపీకి మరో అవకాశం దక్కింది.
దెబ్బ తీసిన గ్యారంటీలు
ఎగ్జిట్ పోల్స్ హర్యానాలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని అంచనా వేసాయి. వాస్తవ ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. తొలుత విజయం వైపు కాంగ్రెస్ దూసుకెళ్తున్నట్లు కనిపించినా అనూహ్యంగా బీజేపీ పుంజుకుంది. హర్యానాలో తొలి సారి హ్యాట్రిక్ విజయం సాధించిన పార్టీగా నిలిచింది. అయితే, కాంగ్రెస్ ఓటమి వెనుక స్వీయ తప్పిదాలే ఎక్కువగా ఉన్నాయి. కర్ణాటక, తెలంగాణలో తమకు విజయం అందించిన గ్యారంటీలే ఇక్కడా గెలిపిస్తాయని నమ్మకం పెట్టుకున్నారు. కానీ, అధికారంలోకి వచ్చిన తరువాత కర్ణాటకలోని సిద్దరామయ్య, తెలంగాణలోని రేవంత్ ప్రభుత్వాలు వాటి అమలులో లోపాలు..కష్ట,నష్టాలను బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఆ గ్యారంటీల పై నమ్మకం లేకుండా చేయటంలో సక్సెస్ అయింది.

కాంగ్రెస్ లో విభేదాలు
హర్యానాలో బీజేపీ తమ బలాలు -బలహీనతల పై ముందుగానే అంచనాకు వచ్చింది. కాంగ్రెస్ బలహీనతలు..సామాజిక సమీకరణాలు బలంగా పని చేసే హర్యానాలో ఎవరు ఎవరితో ఉన్నారనేది పూర్తిగా పసిగట్టింది. కాంగ్రెస్ లో మాత్రం మాజీ సీఎం భూపేందర్ హుడా ఇచ్చే నివేదికల పైనే రాహుల్ ఎక్కువగా ఆధారపడ్డారు. ఆయన నిర్ణయాలే ఎన్నికల్లో కీలకం అయ్యాయి. హుడా - షెల్జా మధ్య విభేదాలు ఎన్నికల వేళ బీజేపీకి కలిసి వచ్చాయి. కాంగ్రెస్ రెండుగా చీలింది. పదేళ్ల బీజేపీ పాలన పైన ఉన్న వ్యతిరేకత తమకు గెలుపుగా మారుతుందని హస్తం పార్టీ నేతలు అతి విశ్వాసం తో వ్యవహరించారు. సామాజిక సమీకరణాల్లోనూ అంచనాలు తప్పాయి.
సమీకరణాల లెక్కల్లో
హర్యానాలో జాట్ ల ప్రభావం ఎక్కువ. దాదాపు 35 నుంచి 40 సీట్లలో జాట్‌లు డిసైడింగ్ ఫ్యాక్టర్. కాంగ్రెస్ 35 మంది జాట్ అభ్యర్థుల్ని బరిలోకి దించినా ఫలితం దక్కలేదు. అదే సమయంలో జాట్ ఓటింగ్ ఐఎన్ఎల్డీ చీల్చుతుందని గ్రహించిన బీజేపీ జాటేతర కులాలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అందులో సఫలం అయింది. కాంగ్రెస్ జాట్ వర్గానికి 28 సీట్లు ఇవ్వగా..బీజేపీ 16 మంది జాట్ అభ్యర్ధులకు మాత్రమే సీట్లు ఇచ్చింది. రైతు చట్టాల ప్రభావం హర్యానాలో కనిపించలేదు. రెజ్లింగ్ వివాదాలు..వినీశ్ ఫోగట్ కు సీటు తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ అంచనాలు తప్పాయి. ఆప్ తో కలిసి వెళ్లకుండా సీట్ల విషయంలో రాజీ ధోరణి లేకుండా ముందుకు వెళ్లటం కాంగ్రెస్ కు నష్టం చేసాయి.
బీజేపీ పక్కా ప్లాన్
ఆప్ కు 1.38 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ - బీజేపీ మధ్య తాజా సమాచారం మేరకు ఒక శాతం మాత్రమే తేడా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక...ఎన్నికలకు ముందే బీజేపీ నాయకత్వం అప్రమత్తం అయింది. మార్చిలో సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్ ను తప్పించి నాయబ్ సింగ్ సైనీకీ సీఎంగా పగ్గాలు అప్పగించింది. ఖట్టర్ ను కేంద్ర మంత్రిని చేసింది. జాట్ వైపు కాంగ్రెస్ ఆశలు పెంచుకోగా.. బీజేపీ ఓబీసీలకు ప్రాధాన్యత ఇచ్చింది. 28 మంది ఓబీసీలకు సీట్లు ఇచ్చింది. ఇక.. ఆరెస్సెస్ నేతలు త్రిపుర తరహాలో కాంగ్రెస్ పట్టు..బీజేపీకి వ్యతిరేకత ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా డోర్ టు డోర్ ప్రచారం చేసారు. మోదీ ని చూసి ఓట్లు వేయాలని నినదించారు. దీంతో.. బీజేపీ ట్రాప్ లో పడిన కాంగ్రెస్ మరోసారి సెల్ఫ్ గోల్ చేసుకుంది. ఫలితంగా బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించింది.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications