పంజాబ్ స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ హవా.. 6 కార్పొరేషన్లు కైవసం
పంజాబ్‌లో మునిసిపల్ కార్పొరేషన్, నగర పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనలు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. బీజేపీపై వ్యతిరేతక కాంగ్రెస్ పార్టీకి అనుకూలించింది. బీజేపీ, శిరోమణి అకాలీదళ్‌కు వ్యతిరేకంగా ప్రజలు తీర్పును ఇచ్చారు. హస్తమే మా నేస్తం అని చెప్పారు.

7 కార్పొరేషన్ల ఫలితాలను బుధవారం ప్రకటించారు. 6 కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మరొ కార్పొరేషన్‌లో 20 సీట్లను కాంగ్రెస్ అతిపెద్దపార్టీగా నిలిచింది. రీపోలింగ్ జరుగుతున్న మొహాలీ మునిసిపల్ కార్పొరేషన్ కూడా కాంగ్రె్‌స్‌కు దక్కే అవకాశం ఉంది.
బటిండా, హోషియర్‌పూర్, కపుర్తాలా, అబొహర్, బాటలా, పటాన్ కోట్‌లలో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ సాధిచింది. మెగాలో మరో ఆరు వార్గుల్లో విజయం సాధిస్తే.. అక్కడ కూడా హస్తం రెపరెపలాడబోతోంది. బీజేపీ గురుదాస్ పూర్, పటాన్ కోట్, మాల్వా, డోబాలో నష్టపోయింది.












Click it and Unblock the Notifications