శశికళకు మద్దతిస్తామని పార్టీ చీఫ్:మండిపడ్డ కాంగ్రెస్ ఎంఏల్ఏలు
అన్నాడిఎంకెలోని సంక్షోభ పరిస్థితులు కాంగ్రెస్ పార్టీపై పడ్డాయి.అన్నాడిఎంకె చీప్ శశికళకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తిరునవుక్కరసు మద్దతు ప్రకటించడాన్ని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంఏల్ఏలు, నాయక
చెన్నై:తమిళనాడు అధికార అన్నాడిఎంకె పార్టీలో చోటుచేసుకొన్న సంక్షోభ పరిస్థితులు కాంగ్రెస్ పార్టీపై కూడ పడ్డాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిఎంకె తో కలిసి పోటీచేసింది. అయితే తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శశికళకు మద్దతు ప్రకటించడాన్ని ఆ పార్టీకిచెందిన ఎంఏల్ఏలు వ్యతిరేకిస్తున్నారు.
తమిళనాడు రాష్ట్రంలో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు ఉన్న అన్ని రకాల అవకాశాలను వినియోగించుకొనేందుకుగాను అన్నాడిఎంకెలోని రెండు వర్డాలు ప్రయత్నిస్తున్నాయి.
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిఎంకెతో కలిసి పోటీచేసింది. ఈ ఎన్నికల్లో డిఎంకెకు 89 మంది ఎంఏల్ఏలు, కాంగ్రెస్ పార్టీకి 8మంది ఎంఏల్ఏలు ఈ కూటమి సభ్యులుగా ఉన్నారు.
అన్నాడిఎంకెలో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళలు ముఖ్యమంత్రి పదవి కోసం పావులు కదుపుతున్నారు.

కాంగ్రెస్ పై అన్నాడిఎంకె సంక్షోభం
తమిళనాడులో అన్నాడిఎంకెలో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. శశికళ, పన్నీర్ సెల్వంలు గ్రూపులుగా విడిపోయారు. ఎంఏల్ఏలు, నాయకులు కూడ రెండుగ్రూ,పులుగా విడిపోయారు. అయితే ఈ పరిస్థితుల్లో అన్నాడిఎంకె ప్రధాన కార్యరద్శి శశికళకే తాము మద్దతిస్తామని కాంగ్రెస్ పార్టీ తిరునవుక్కరసు బహిరంగంగా ప్రకటన చేశారు. ఈ ప్రకటన పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంఏల్ఏలు విభేధిస్తున్నారు.

గవర్నర్ పై కాంగ్రెస్ ఆరోపణలు
రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుపై కూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరునవుక్కరసు విమర్శలు గుప్పించారు. శశికళను ఎందుకు ప్రమాణస్వీకారం కోసం ఆహ్వానించడం లేదని ఆయన ఆరోపించారు.కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యులు ఆరుగురు ఎంఏల్ఏలు తిరునవుక్కరసు అభిప్రాయంతో విబేధిస్తున్నారు.ఇద్దరు మాత్రమే శశికళ ముఖ్యమంత్రి కావడాన్ని సమర్థిస్తున్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపి ఒకరు ప్రకటించారు.

అన్నాడిఎంకెకు ఎలా మద్దతిస్తారు
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిఎంకెతో కలిసి పోటీచేసింది. ప్రస్తుతం కూడ డిఎంకెతోనే ఆ పార్టీ ఉంది.అయితే డిఎంకెను కాదని అన్నాడిఎంకెకు ఎలా మద్దతిస్తారని ఆయన ప్రశ్నించారు.తమిళనాడు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రజల అభిప్రాయాలను కూడ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరాన్ని కూడ గుర్తించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎంఏల్ఏలు పార్టీ చీప్ తిరునవుక్కరసును ప్రశ్నించారని సమాచారం.
కాంగ్రెస్ ది తలోదారి
అన్నాడిఎంకె సంక్షోభ ప్రభావం కాంగ్రెస్ పార్టీపై పడుతోంది. శశికళకు మద్దతు ప్రకటించడాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరునవుక్కరసు మద్దతు ప్రకటించారు.అయితే ఎంఏల్ఏలు దీన్ని ఖండిస్తున్నారు.శాసనసభలో బలపరీక్ష నిర్వహించాల్సిన పరిస్థితులు ఎదురైతే కాంగ్రెస్ పార్టీ ఎవరి పక్షం వహించాలనే దానిపై రాహుల్ గాంధీతో సమావేశమయ్యేందుకు తిరునవుక్కరసు ఢిల్లీ వెళ్ళాడు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడే వరకు గవర్నర్ నిరీక్షించాలంటూ మాజీ కేంద్ర మంత్రి చిదంబరం విన్నవించారు.

నాడు జయకు మద్దతు, నేడు శశికళ
తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరునవుక్కరసు గతంలో అన్నాడిఎంకె పార్టీలో ఉండేవారు. ఎంజిఆర్ చనిపోయిన సమయంలో ఆయన జయలలితకు అనుకూలంగా ఉన్నారు.ఆ తర్వాత జయలలితకు ఆయనకు విబేధాలు రావడంతో ఆయన పార్టీ నుండి వచ్చారు. అన్నాడిఎంకె సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఆనాడు జయకు, నేడు శశికళకు తిరునవుక్కరసు మద్దతుగా నిలిచారు.
-
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు ఇవే.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం












Click it and Unblock the Notifications