దేశవ్యాప్త ఆందోళనలు: 10 రోజులు నిరసనలు, కాంగ్రెస్ పార్టీ
దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఇటీవల జరిగిన సమావేశంలో పార్టీ డిషిషన్ తీసుకుంది.ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు, నిత్యావసరాల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జులై 7 నుంచి 10 రోజుల పాటు దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. వివిధ రాష్ట్రాల ఏఐసీసీ ఇంఛార్జులు, పార్టీ ప్రధాన కార్యదర్శులతో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు.
బ్లాక్,జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతారు. రాష్ట్ర విభాగాలు జులై 7-17వ తేదీల మధ్య అమలు చేస్తాయని కేసీ వేణుగోపాల్ తెలిపారు. బ్లాక్ స్థాయిల్లో మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఏఐసీసీ సంస్థలు ఆందోళనల్లో పాల్గొంటాయని, జిల్లా స్థాయిల్లో పార్టీ నేతలు సైకిల్ ర్యాలీలు చేపడతారని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ర్యాలీలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. అన్ని పెట్రోల్ బంకుల వద్ద ధర్నాలు చేపడతామన్నారు.

మే 2 నుంచి ప్రభుత్వం 29 సార్లు ఇంధన ధరలు పెంచిందని వేణుగోపాల్ తెలిపారు. 150కిపైగా నగరాల్లో లీటరు పెట్రోల్ ధర రూ.100 దాటింది. పెట్రోల్, డీజీల్ పై విధించిన ఎక్సైజ్ సుంకంతో బీజేపీ ప్రభుత్వం గడిచిన ఏడు సంవత్సరాల్లో రూ.22 లక్షల కోట్లు ఆర్జించింది. గడిచిన ఆరునెలల్లో వంట నునెల ధరలు దాదాపు రెండింతలు అయ్యాయని తెలిపారు. టోకు ద్రవ్యోల్బణం మే 2021లో 12.94శాతానికి చేరిందని.. ఇది 11 ఏళ్లలోనే అత్యధికం అని వేణుగోపాల్ తెలిపారు. కరోనా మహమ్మారి, నిరుద్యోగిత, జీతాల కోత వంటి వాటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వేణుగోపాల్ తెలిపారు.












Click it and Unblock the Notifications