Exit Polls 2024: ఎగ్జిట్ పోల్స్ డిబేట్లకు హాజరుపై కాంగ్రెస్ యూటర్న్..!
దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమితో హోరాహోరీ పోరాడిన ఇండియా కూటమిలో కీలకమైన కాంగ్రెస్ పార్టీ ఎగ్జిట్ పోల్స్ వేళ కీలక నిర్ణయం తీసుకుంది. ఎగ్జిట్ పోల్స్ ఎలాగో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికే అనుకూలంగా ఉంటాయనే నిర్ణయానికి వచ్చేసిన కాంగ్రెస్.. వీటిపై టీవీల్లో నిర్వహించే చర్చలకు వెళ్లరాదని నిర్ణయించింది. అయితే ఇవాళ జరుగుతున్న ఇండియా కూటమి భేటీలో దీనిపై మిత్రపక్షాలతో చర్చించాక నిర్ణయం మార్చుకుంది.
ఎగ్జిట్ పోల్స్ పై టీవీల్లో నిర్వహించే చర్చల్లో పాల్గొనడం వల్ల తమకు ఎలాంటి ఉపయోగం లేదని, నష్టమే ఎక్కువని భావించిన కాంగ్రెస్.. వాటికి వెళ్లకూడదని నిన్న నిర్ణయం తీసుకుంది. అంతే కాదు అన్ని రాష్ట్రాల్లోనూ తమ పార్టీకి చెందిన యూనిట్లు, నేతలకూ ఇదే సమాచారం ఇచ్చింది. దీంతో వారు ఎగ్జిట్ పోల్ చర్చలకు దూరంగా ఉండిపోవాలని నిర్ణయించారు. అయితే ఇవాళ జరిగిన ఇండియా కూటమి భేటీలో ఇదే అంశం చర్చకు వచ్చింది.

టీవీ చర్చలకు దూరంగా ఉండిపోవడం వల్ల బీజేపీ అరాచకాల్ని ఎండగట్టేందుకు లభించే అవకాశాన్ని వదులుకున్నట్లు అవుతుందని ఇండియా కూటమిలో మిత్రపక్షాలు కాంగ్రెస్ కు సూచించాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ మనసు మార్చుకుంది. ఇవాళ ఎగ్జిట్ పోల్స్ విడుదల తర్వాత టీవీల్లో జరిగే చర్చలకు హాజరవుతున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ట్వీట్ చేశారు. ఇండియా కూటమి భేటీలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. బీజేపీ ఆధ్వర్యంలో తయారైన ఎగ్జిట్ పోల్స్ ను ఎండగట్టేందుకు టీవీ చర్చలకు వెళ్తామని ప్రకటించారు.
INDIA parties met and decided to expose the bjp and its ecosystem on the prefixed exit polls.
— Pawan Khera 🇮🇳 (@Pawankhera) June 1, 2024
After considering factors for and against participating in the exit polls, it has been decided by consensus that all the INDIA parties will participate in the exit poll debates on…












Click it and Unblock the Notifications