వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిబిఐతో మోడీని ఇరికించే ప్రయత్నం: జైట్లీ లేఖ

By Pratap
|
Google Oneindia TeluguNews

Arun Jaitley
న్యూఢిల్లీ: తమ పార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని తప్పుడు కేసులో ఇరికించడానికి కాంగ్రెసు పార్టీ సిబిఐ వంటి దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరిచే ప్రయత్నం చేస్తోందని బిజెపి నాయకుడు అరుణ్ జైట్లీ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ప్రధాని మన్మోహన్ సింగ్‌కు మంగళవారం సుదీర్ఘమైన లేఖ రాశారు. సోహ్రబుద్దీన్, ఇష్రాత్ జహాన్, తులసి ప్రజాపతి, హరీన్ పాండ్యా కేసుల్లో మోడీని, ఆయన సహచరుడు అణిత్ షాను ఇరికించడానికి కాంగ్రెసు ప్రయత్నిస్తోందని జైట్లీ అన్నారు.

కాంగ్రెసు మిత్రపక్షంగా సిబిఐ వ్యవహరిస్తోందని, 2014 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తన రాజకీయ ప్రత్యర్థులను అణచేయడానికి కాంగ్రెసు సిబిఐని వాడడానికి సిద్ధపడుతోందని నరేంద్ర మోడీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అరుణ్ జైట్లీ ప్రధానికి లేఖ రాశారు.

రాజకీయ ప్రేరేపిత దర్యాప్తులపై సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఆయన ప్రధానిని కోరారు. ప్రజాదరణనను కోల్పోయిన కాంగ్రెసు పార్టీ వచ్చే ఎన్నికల్లో తనమ పార్టీని, మోడీని ఓడించలేని గ్రహించి రాజకీయ ప్రత్యర్థులను దెబ్బ తీయాలనే వ్యూహాన్ని అనుసరిస్తోందని ఆయన అన్నారు. రాజకీయంగా తమ పార్టీని, మోడీని కాంగ్రెసు ఎదుర్కోలేదని, దీంతో సిబిఐని ప్రయోగించాలని చూస్తోందని ఆయన అన్నారు.

ప్రధానికి అరుణ్ జైట్లీ 15 పేజీల లేఖ రాశారు. కాంగ్రెసు పార్టీ కేంద్ర మంత్రులతో, పార్టీ సీనియర్ ఆఫీస్ బియరర్లతో ఓ రాజకీయ విభాగాన్ని నడుపుతోందని ఆయన ఆరోపించారు. కేంద్ర హోం మంత్రికి గుజరాత్ హోం మంత్రి సలహాదారుగా నియమించుకున్నారని, ఆ ఐపియస్ అధికారి గుజరాత్ రాజకీయ నాయకులను తప్పుడు కేసుల్లో ఇరికించే పనులను సమన్వయం చేస్తాడని ఆయన అన్నారు.

English summary
Detailed letter to PM Manmohan Singh, BJP leader Arun Jaitley on Tuesday accused the Congress of misusing investigative agencies like the CBI to “falsely” implicate BJP PM candidate Narendra Modi and his close aides like Amit Shah in the killings of Sohrabuddin, Ishrat Jahan, Tulsi Prajapati and Harin Pan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X