lockdown:మే 4వ తేదీ నుంచి కొన్ని జిల్లాల్లో సడలింపు, కానీ ఆంక్షలు, నిబంధనలు మాత్రం తప్పనిసరి
వైరస్ ప్రభావం లేని జిల్లాల్లో లాక్‌డౌన్ ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మే 4 నుంచి ఆ జిల్లాల్లో సడలింపులు ఇస్తామని పేర్కొన్నది. మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ మార్గదర్శకాలు పాటించాలని.. ఆ మరునాటి నుంచి ఏ నిబంధనలను అనుసరించాలనే అంశాన్ని తెలియజేస్తామని హోంశాఖ అదికార ప్రతినిధి ఒకరు సోషల్ మీడియో ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
Recommended Video

మే 4 తర్వాత..
దేశంలో లాక్‌డౌన్‌పై హోంశాఖ రాష్ట్రాలతో రివ్యూ నిర్వహించిందని పేర్కొన్నారు. లాక్ డౌన్ వల్ల అద్భుత ఫలితాలు వచ్చాయని.. దీనిని కొనసాగిస్తామన్నారు. మే 3వ తేదీ వరకు ఆంక్షలు కఠినంగా ఉంటాయని.. తర్వాత పరిస్థితిని బట్టి చర్యలు తీసుకుంటామని వివరించారు. సోమవారం ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ నిర్వహించిన సమీక్షలో రెడ్ జోన్, హాట్ స్పాట్, కంటైన్మెంట్ జోన్లలో మాత్రమే లాక్ డౌన్ కొనసాగుతోందని.. వైరస్ ప్రభావం లేని జిల్లాలకు సడలింపులు ఇస్తామని సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.

40 రోజులు..
వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో మార్చి 24వ తేదీ నుంచి లాక్ డౌన్ కొనసాగుతోంది. మే 3వ తేదీ వరకు అంటే 40 రోజులు లాక్ డౌన్ కంటిన్యూ అయ్యింది. దీంతో వైరస్ తగ్గుముఖం పట్టిన ప్రాంతాలకు గత రెండువారాల నుంచి మినహాయింపులు ఇస్తూ వస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలకు అనుమతి ఇస్తున్నారు. హాట్ స్పాట్ కానీ, కంటైన్మెంట్ జోన్ కానీ ప్రాంతాల్లో నాన్ ఎస్సెన్సియల్ గూడ్స్ విక్రయించేందుకు హోంశాఖ అనుమతించిన సంగతి తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో ఉన్న వలసకూలీలు సొంత రాష్ట్రం వెళ్లేందుకు బుధవారం హోంశాఖ పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ వల్ల వలసకూలీలు, విద్యార్థులు ఎక్కడికక్కడ చిక్కుకున్న సంగతి తెలిసిందే.

250 జిల్లాలు
దేశంలో 250 జిల్లాలు గ్రీన్ జోన్ పరిధిలో ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో లాక్ డౌన్ పాక్షికంగా ఎత్తివేస్తారు. ఆంక్షలను మాత్రం కొద్దిగా సడలిస్తారు. ఇన్ ఫెక్షన్ ప్రభావం ఉన్నందున పరిస్థితిని నిశీతంగా గమనిస్తారు. దేశంలో 31 వేల 787 పాజిటివ్ కేసులు ఉండగా...మృతుల సంఖ్య 1008కి చేరింది. గత 24 గంటల్లోనే 71 మంది చనిపోయారు. గత పదిహేను రోజుల్లో రెడ్ జోన్ల సంఖ్య 170 నుంచి 129కి పడిపోయింది. ఇదే సమయంలో గ్రీన్ జోన్ల సంఖ్య కూడా 325 నుంచి 307కి పడిపోవడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. అయితే ఆరెంజ్ జోన్ల సంఖ్య మాత్రం 207 నుంచి 297కి పెరిగింది.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications