వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యాంగమే దిక్సూచి, దాని పవిత్రతను కాపాడండి: మోడీ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: చీకటికాలంలో రాజ్యాంగం మన దేశానికి వెలుగునిచ్చిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. రాజ్యాంగంపై రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాలగమనంలో రాజ్యాంగం అనేక సమస్యలకు పరిష్కారం చూపిందని ఆయన అన్నారు.

రాజ్యాంగం మనకు దిక్సూచి లాంటిదని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. భారతీయ జీవన విధానంలో మంచి విషయాలను పది మందికి నిరంతం చెబుతూ ఉంటామన్నారు. అందులో భాగంగా రాజ్యాంగం దేశంలోని ప్రతి ఒక్కరికి అండగా నిలబడుతుందనే భావనను కలిగించాలన్నారు.

Constitution is our guiding light, says Prime minister Narendra Modi

భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చాక దేశ మనుగడపై చాలా మందికి సందేహాలు ఉండేవన్నారు. ముఖ్యంగా బ్రిటిష్ వాళ్లు అప్పుడప్పుడు ఇలాంటి భావనకు మరింత బలం చేకూరేలా ప్రవర్తించారన్నారు. ఎన్నో అవాంతరాలను దాటుకుని భారత్ స్వతంత్ర, ప్రజాస్వామ్య దేశంగా సగర్వంగా తలెత్తుకుని నిలబడిందన్నారు.

భారత్‌లో భిన్నత్వంలో ఏకత్వం రాజ్యాంగం వల్లనే సాధ్యమైందన్నారు. భారతరత్న డాక్టర్. బీఆర్ అంబేద్కర్ మనకు అధ్భుతమైన రాజ్యాంగాన్ని అందించారని కొనియాడారు. చట్టసభల్లో జరిగే ప్రతి చర్చా ప్రజల్లోకి వెళ్లాలన్నారు. ముఖ్యంగా అధికార, ప్రతిపక్ష సభ్యులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు.

English summary
PM Narendra Modi says in Rajya Sabha Our Constitution is not about laws only. It is a social document. We admire these facets of our Constitution.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X