ఇండియాలో కరోనా దెబ్బ.. టాప్ 5 రాష్ట్రాలివే .. 90 వేలు దాటిన మృతుల సంఖ్య !!
భారతదేశంలో కరోనా పంజా విసురుతూనే ఉంది. ఒకవైపు కరోనా బారిన పడిన వారి రికవరీ రేట్ పెరుగుతున్నప్పటికీ, అంతే సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది.
కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 83,347 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా 1,085 మంది కరోనా బారిన పడి మృతి చెందినట్లుగా సమాచారం.

ఇండియాలో 56 లక్షలు దాటిన కేసులు ..90 వేలు దాటిన మరణాలు
ప్రస్తుతం భారతదేశంలో కరోనా కేసులను చూస్తే 56,43,481 కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది. వీటిలో 9,68,232 యాక్టివ్ కేసులు ఉండగా, 45,84,392 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 90,050 మంది కరోనాతో మృతి చెందినట్లుగా తెలుస్తుంది. పాజిటివ్ కేసులు సంఖ్య 56 లక్షల మార్కును దాటగా, మృతుల సంఖ్య 90 వేలను దాటింది
. మంగళవారం ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 9,53,683 మందికి పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 6,62,79,462కు పెరిగిందని ఐసీఎంఆర్ ప్రకటించింది.

మహారాష్ట్రనే మొదటి స్థానంలో .. తర్వాత స్థానంలో ఏపీ
భారత్ లో కరోనా కేసులలో మహారాష్ట్ర అత్యంత ప్రభావితం అయిన తొలిరాష్ట్రంగా ఉంది . కరోనా ప్రారంభం అయిన తొలినాళ్ళ నుండి మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి .మహారాష్ట్రలో కరోనా కేసులు 12,42,770 గా ఉంది. యాక్టివ్ కేసులు 2,72,410 గా ఉన్నాయి . మహారాష్ట్ర తర్వాత రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇప్పటివరకు 6,39,302 కేసులు నమోదు కాగా 71,465 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కరోనా నుండి కోలుకుని 5,62,376 డిశ్చార్జి కాగా 5,461 మంది మృతి చెందారు.

మూడో స్థానంలో తమిళనాడు.. నాలుగు ,ఐదు స్థానాల్లో కర్ణాటక, యూపీ
ఆంధ్ర ప్రదేశ్ తర్వాత స్థానంలో తమిళనాడు లో కరోనా కల్లోలం కొనసాగుతుంది. తమిళనాడులో 5,52,674 కేసులు ఇప్పటివరకు నమోదుకాగా 46,350 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో కర్ణాటక రాష్ట్రం 5,33,850 కేసులతో , ఐదవ స్థానంలో ఉత్తరప్రదేశ్ 3,64,543 కేసులతో నిలిచాయి. ప్రస్తుతం ఇండియాలో కరోనా మరణాల రేటు 1,59 శాతంగా ఉంది . ప్రపంచ దేశాల్లో ఇది 3 శాతంగా ఉంది. కొత్తగా నమోదవుతున్న రోజు వారీ కేసుల లెక్కలో ఇండియా మొదటి స్థానంలో ఉంది. మొత్తం కేసులలో ఇండియా అమెరికా, బ్రెజిల్ తర్వాత మూడో స్థానంలో ఉంది .












Click it and Unblock the Notifications