వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళలో కరోనా తగ్గుముఖం.. 20 వేల లోపు కొత్త కేసులు

|
Google Oneindia TeluguNews

కేరళలో కరోనా వైరస్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా 30 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. వందల సంఖ్యలో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. మొహర్రం, ఓనమ్‌, రక్షాబంధన్ ‌వంటి వరుస పండుగ సెలవుల నేపథ్యంలో కరోనా కేసులు మరోసారి రికార్డు స్థాయికి పెరిగాయి. అయితే ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.

ఆదివారం నుంచి సోమవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 19,688 కరోనా కేసులు, 135 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 42,27,526కు, మొత్తం మరణాల సంఖ్య 21,631కు పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో 28,561 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 39,66,557కు చేరుకుందని, ప్రస్తుతం రాష్ట్రంలో 2,38,782 యాక్టివ్ ‌కేసులు ఉన్నట్లు పేర్కొంది. దేశంలో కరోనా హాట్‌స్పాట్‌గా కేరళ కొనసాగుతుంది. ఆ రాష్ట్రంలో ‌పాజిటివిటీ రేటు 16.71 శాతం ఉన్నది.

corona cases are decreased in the kerala

వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

Recommended Video

పోలీసుల అక్రమకేసులకు భయపడేది లేదంటున్న మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు || Oneindia Telugu

వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం అయితే ప్రకటించలేదు. ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.

English summary
corona cases are decreased in the kerala state. last 24 hours 20 thousand below cases are found
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X