ఢిల్లీలో కరోనా బీభత్సం.. 433శాతం పెరిగిన కరోనా కేసులు!!
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఒక్కసారిగా ఉవ్వెత్తున కేసులు పెరుగుతున్న తీరు ఢిల్లీలో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మార్చి 30వ తేదీన ఢిల్లీలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 932 గా ఉంటే, ఆ తరువాత 15 రోజుల్లోనే ఊహించని విధంగా కరోనా కేసులు పెరిగిన పరిస్థితి ఉంది.
ఏప్రిల్ 17వ తేదీ నాటికి మొత్తం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4,976కు చేరుకుంది. 15రోజుల్లో 433శాతం కరోనా కేసుల రేటు పెరిగింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం కరోనా కట్టడి విషయంలో అప్రమత్తమైంది. అయితే పెరుగుతున్న కరోనా కేసులతో అప్రమత్తమైన ఢిల్లీ ప్రభుత్వం కట్టడి యత్నాలు చేస్తోంది. కరోనా నిబంధనలను పాటిస్తూ వ్యాక్సిన్ ల బూస్టర్ డోసు ను తీసుకుంటే ఎటువంటి ప్రమాదం ఉండబోదని చెబుతోంది.

పెరుగుతున్న కరోనా కేసులతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, యాక్టివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ ఆసుపత్రులలో చేరికలు తక్కువగా ఉండడంతో కాస్త ఊరట లభిస్తుందని ప్రభుత్వం వెల్లడిస్తుంది. ప్రస్తుతం ఢిల్లీలో ప్రతిరోజు వెయ్యికిపైగా కరోనా కేసులు నమోదు అవుతున్న పరిస్థితి దృష్ట్యా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సామాజిక దూరం పాటించాలని, మాస్కులు ధరించారని చెబుతోంది. కరోనా నియంత్రణా బాధ్యత అందరిపైనా ఉందని వెల్లడిస్తుంది.

అంతేకాదు ప్రభుత్వం కూడా ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని వెల్లడిస్తోంది. ఢిల్లీలో కరోనా కేసుల పెరుగుదలకు ఎక్స్ బిబి 1.16 వేరియంట్ కారణమని నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీలో ఏప్రిల్ 12వ తేదీన తొలిసారిగా 1000 కేసులను దాటి కరోనా కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి ప్రతి రోజు వెయ్యికి పైగా కరోనా కేసులను ఢిల్లీ చూస్తోంది. ఇక పెరుగుతున్న కేసులతో ప్రజలు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడానికి అధిక సంఖ్యలో ముందుకు వస్తున్నారు. దీంతోనే కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు తెలుస్తుంది.












Click it and Unblock the Notifications