భారత్ లో తాజాగా 12,514 కొత్త కేసులు, 251 మరణాలు; సగానికి పైగా ఆ రాష్ట్రం నుండే !!

భారతదేశంలో కరోనా మహమ్మారి కేసులు నమోదవుతున్నాయి. స్వల్ప హెచ్చుతగ్గులతో కరోనా కేసుల నమోదు కొనసాగుతుంది. గత 24 గంటల్లో భారత్లో 12,514 మంది పాజిటివ్ బారిన పడగా, భారత్‌లో మొత్తం 3,42,85,914 కరోనా వైరస్ కేసులు ఇప్పటివరకు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సోమవారం తన రోజువారీ బులెటిన్‌లో తెలిపింది. అదే సమయంలో, 251 కోవిడ్ -19 సంబంధిత మరణాలు కూడా నమోదయ్యాయి. దీంతో కరోనా మరణాల సంఖ్య 4,58,437 కు చేరుకుంది.

భారత్లో కొత్త కేసులు, మరణాలలో సగానికి పైగా కేరళ నుండే
తాజా కొత్త కేసులు మరియు మరణాలలో, 7167 (57 శాతం) కొత్త కేసులు మరియు 167 (67 శాతం) మరణాలు ఒక్క కేరళ రాష్ట్రం నుండి మాత్రమే సంభవించాయి. అనారోగ్యం నుండి కోలుకున్న తర్వాత మరో 12,718 మంది రోగులు గత 24 గంటల్లో డిశ్చార్జ్ అయ్యారని సమాచారం. దీంతో మొత్తంగా కరోనా మహమ్మారి నుండి కోలుకున్న కేసుల సంఖ్య 3,36,68,560కి చేరుకుందని సోమవారం నాటి డేటా వెల్లడించింది. దీంతో రికవరీ రేటు మరింత మెరుగుపడి 98.20 శాతానికి చేరుకుంది. ఈరోజు కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువ నమోదు అయ్యాయి. క్రియాశీల రోగుల సంఖ్య, అదే సమయంలో, 1,58,817కి పడిపోయింది. గత 24 గంటల్లో 455 కేసులు తగ్గాయి . మొత్తం సంఖ్యలో 0.46 శాతం కరోనా యాక్టివ్ కేసులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.

corona in India: 12,514 new cases, 251 deaths; More than half cases, deaths are from kerala !!

ఎక్కువ కేసులు నమోదు చేస్తున్న మూడు రాష్ట్రాలివే
ఇదిలా ఉంటే గత 24 గంటల్లో కేరళ రాష్ట్రంలో 7167 కొత్త కేసులు నమోదు కాగా 167 మంది కరోనా కారణంగా మృతి చెందారు. కేరళ రాష్ట్రంలో 79,266 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేరళ తరువాత ఎక్కువ కేసులు నమోదు చేస్తున్న మహారాష్ట్రలో 1,172 కరోనా కేసులు నమోదు కాగా 20 మంది కరోనా కారణంగా మృతి చెందారు. మహారాష్ట్రలో 16,658 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఆ తర్వాత అత్యధిక కేసులు నమోదు చేస్తున్న తమిళనాడు రాష్ట్రంలో 1,009 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. 12 మంది కరోనా కారణంగా మృతి చెందారు. తమిళనాడు రాష్ట్రంలో 11,492 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

భారత్ లో వ్యాక్సినేషన్ ఇలా
అక్టోబరు 31న కోవిడ్-19 కోసం 881,379 శాంపిళ్లను పరీక్షించడంతో రోజువారీ సానుకూలత రేటు 1.42 శాతంగా నమోదైంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ప్రకారం, ఇప్పటి వరకు మొత్తం 60,92,01,294 నమూనాలను పరీక్షించారు. భారత్ లో వ్యాక్సినేషన్ కార్యక్రమం యుద్ధప్రాతిపదికన కొనసాగుతుంది. దాదాపు 1.28 మిలియన్ వ్యాక్సిన్లు ఆదివారం నిర్వహించబడ్డాయి, జనవరి 16 నుండి దేశవ్యాప్తంగా ఇనాక్యులేషన్ డ్రైవ్ ప్రారంభమైనప్పటి నుండి మొత్తం 1.06 బిలియన్‌లకు పైగా వ్యాక్సిన్ డోస్‌లు ఇవ్వబడ్డాయి.

భారత్ కు AY4.2. భయం ... థర్డ్ వేవ్ ఆందోళన
సోమవారం, ఢిల్లీలో పాఠశాలలు అన్ని తరగతులకు 50 శాతం గరిష్ట తరగతి బలంతో తిరిగి తెరవబడ్డాయి. కేరళలో 1 నుండి 7, 10 మరియు 12 తరగతులకు పాఠశాలలు కూడా తిరిగి తెరవబడ్డాయి. ఇదిలా ఉంటే కరోనా వైరస్ డెల్టా వేరియంట్ ఉప వంశమైన AY4.2. కేసులు భారతదేశంలో నమోదవుతున్న క్రమంలో, కేసులు పెరుగుదలపై ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా థర్డ్ వేవ్ పై అనుమానం వ్యక్తమవుతోంది. ఏదిఏమైనా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, కరోనానిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం పదేపదే హెచ్చరిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+