కొత్త కొత్త లక్షణాలతో కరోనా కొత్త స్ట్రెయిన్స్ .. తాజాగా యాడ్ అయిన లక్షణాలివే .. తస్మాత్ జాగ్రత్త !!
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది . కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత కాస్త కరోనా కేసులు తక్కువగా నమోదు అవుతున్నట్లు భావిస్తున్నప్పటికీ కరోనా మహమ్మారి రోజుకో కొత్త రూపం తీసుకుంటూ మానవ జీవితాలతో ఆడుకుంటూనే ఉంది. కరోనా వైరస్ రూపాంతరం చెందుతోంది. ఇప్పటికే నాలుగు వేల రకాల వైరస్లు ఉన్నాయని పరిశోధకులు వెల్లడించిన నేపథ్యంలో, కొత్తకొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ లు పుట్టుకొస్తున్నాయి.

పెరిగిపోతున్న కొత్త లక్షణాల జాబితా ..
ఇక ఇదే సమయంలో కరోనా వైరస్ లక్షణాలు జాబితా కూడా రోజురోజుకు పెరిగిపోతోంది.
మొదట్లో దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి, డయేరియా, రుచి , వాసన కోల్పోవటం వంటి లక్షణాలు మాత్రమే కరోనా వైరస్ లక్షణాలుగా భావించినప్పటికీ ఆ తరువాత ఆ జాబితా పెరిగి పోవడం కనిపిస్తుంది. ఇప్పుడు జనసామాన్యానికి తెలిసిన లక్షణాలు కాకుండా, చాలా లక్షణాలు కరోనా మహమ్మారి పాజిటివ్ కు తోడయ్యాయి. ఏవి కరోనా లక్షణాలో అర్ధకాని పరిస్థితిలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఒళ్ళు నొప్పులు, చర్మ వ్యాధులు , తలనొప్పి తో పాటు ఈ లక్షణాలు
కొత్తగా కరోనా మహమ్మారికి ఒళ్ళు నొప్పులు, కళ్ళు ఎర్రగా మారడం, కండ్లకలక, గొంతులో మంటగా ఉండటం , శరీరంపై దద్దుర్లు రావడం, విపరీతమైన తలనొప్పి, కాళ్ళు చేతులు పాలిపోయినట్లుగా తెల్లగా కనిపించడం, అతిసారం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు నరాలకు సంబంధించిన వ్యాధులు, గందరగోళంగా ఉండటం , అయోమయానికి తరచు గురవుతుండటంతో, జ్ఞాపక శక్తిని కోల్పోవడం, మనసు స్థిమితంగా లేకపోవడం కూడా కరోనా మహమ్మారి లక్షణాలుగా తెలుస్తుంది.

అప్రమత్తత అవసరం అంటున్న నిపుణులు .. తస్మాత్ జాగ్రత్త
విపరీతంగా అలసట, అసాధారణమైన చర్మ సమస్యలు, కాళ్లవాపులు కూడా కరోనా మహమ్మారి అనుమానిత లక్షణాలుగా చెప్తున్నారు.
సాధారణంగా అందరూ భావించే కరోనా లక్షణాలతో పాటు ఇతర లక్షణాలు కనిపించినా ,వెంటనే పరీక్ష చేయించుకొని క్వారంటైన్ లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు పరీక్షించిన తర్వాత కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయితే వారు కచ్చితంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేకపోతే వారు మరింత తీవ్ర అనారోగ్య సమస్యలకు గురై ప్రాణాలను పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. అందుకే ఏ లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయొద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications