యూఎస్, బ్రెజిల్ తో పోలిస్తే ఇండియాలో కరోనా తీవ్రత అధికం : లెక్క చెప్పిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

ఇండియాలో కరోనా పంజా విసురుతూనే ఉంది . తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంటూ భారత్ రోజువారి కేసులలో జెట్ వేగంతో దూసుకుపోతుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది . గడచిన 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా 3,07,930 కొత్త కేసులు నమోదయ్యాయి అంటే కరోనా వ్యాప్తి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తమ వెబ్ సైట్ ప్రకటించిన గణాంకాల మేరకు ఇండియా, యునైటెడ్ స్టేట్స్ , బ్రెజిల్ లో కేసుల తీవ్రత అధికంగా ఉందని తెలుస్తుంది.

కరోనా కారణంగా ఒక్క ఆదివారం రోజు 5,537 మరణాలు చోటుచేసుకున్నాయని మొత్తం మృతుల సంఖ్య 9, 17,417 కు చేరుకుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. భారతదేశంలో చూస్తే కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రతినిత్యం 90 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. యూఎస్ , బ్రెజిల్ లో ప్రతిరోజు 40 వేల పైచిలుకు మంది కరోనా వైరస్ బారిన పడుతుంటే, భారతదేశంలో 90 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కావడం భారత్ లో కరోనా తీవ్రతను స్పష్టం చేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది .

Corona severity is higher in India compared to US and Brazil: WHO

ప్రపంచవ్యాప్తంగా అర్జెంటీనా, మొరాకో, ఉక్రెయిన్, ఇండోనేషియా, స్పెయిన్ వంటి 58 దేశాలలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కరోనా కారణంగా అత్యంత ప్రభావితమైన దేశంగా భారతదేశం ఉందని, రోజువారీ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న మొదటి దేశంగా ఇండియా కరోనా వైరస్ తో కల్లోలంగా మారుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇండియా పరిస్థితి ఎక్కువ దారుణంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+