కరోనా టెన్షన్ లోనూ ఉలిక్కిపడ్డ కాశ్మీర్ .. ఎన్ కౌంటర్ ..ఇద్దరు ఉగ్రవాదులు హతం

కరోనా భయంతో తీవ్రమైన ఆందోళనతో ప్రజలు బ్రతుకు వెళ్ళదీస్తుంటే కాశ్మీర్ లో ఊహించని పరిణామం జరిగింది. కాశ్మీర్ ఒక్కసారిగా ఎన్ కౌంటర్ తో ఉలిక్కిపడింది . ఉగ్ర దాడులకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉపద్రవం ముంచుకొస్తుందని ఇంటిలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపధ్యంలో అలెర్ట్ అయిన భారత సైన్యం ఇద్దరు ఉగ్రవాదులను మట్టు పెట్టింది .

ఓ వైపు ప్రపంచమంతా కరోనా మహమ్మారితో అతలాకుతలమవుతుంటే మరోవైపు ఉగ్రవాదులు ఇదే అదనుగా దాడులకు ప్లాన్లు వేస్తున్నారని తెలుస్తుంది . గత కొన్నేళ్లుగా దేశంలో అలజడి సృష్టించేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ప్రయత్నాలు చేస్తున్నా వారి ప్రయత్నాలు ఫలించలేదు . ఎప్పటికప్పుడు మన సైన్యం వారి వ్యూహాలకు చెక్ పెట్టింది. ఇప్పుడు దేశం అత్యవసర సమయంలో ఉండగా ప్రతి వ్యక్తి కరోనా కట్టడికి యుద్ధం చేస్తున్నారు . ఇక ఇదే అదునుగా ఉగ్ర దాడులకు స్కెచ్ వేస్తున్నారని టెలిగ్రాం ద్వారా రహస్య మంతనాలు సాగించారని లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో సరిహద్దుల్లో పోలీస్ సెక్యూరిటీ పెంచాలంటూ ఐబీ హెచ్చరించింది.

corona time ... An Encounter in Kashmir .. two terrorists killed

Recommended Video

    US Economy To Shrink At Fastest Rate Since 1946, Unemployment Rise

    ఇక ఈ క్రమంలోనే జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం ప్రాంతంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఉన్నట్లు జవాన్లకు పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, భద్రతాబలగాలు కుల్గాం పట్టణంలో కూంబింగ్ నిర్వహించారు . ఈ క్రమంలో భద్రతా బలగాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు, భద్రతాబలగాలు ఎదురు కాల్పులకు దిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరికొందరు ఉగ్రవాదులు అక్కడి నుంచి తప్పించుకున్నారు . ఇక వారి కోసం భద్రతాబలగాలు గాలింపు చేస్తున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+