వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: గుజరాత్ VS తమిళనాడు, కరోనా కేసులు ఒక్కటే, మరణాల్లో 90 % తేడా, మోదీ !

|
Google Oneindia TeluguNews

చెన్నై/అహమ్మదాబాద్: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలు హడలిపోతున్నాయి. భారతదేశంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసులు పెరిగిపోవడంతో నేటి నుంచి మే 31 వరకు లాక్ డౌన్ 4.0 లాక్ డౌన్ అమలు చేశారు. భారతదేశంలో 90, 927 కరోనా వైరస్ కేసులు నమోదు కావడంతో సోమవారం ఉదయం వరకు 2, 872 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. దేశంలో మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి. మహారాష్ట్రలో 30, 706 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో 1, 135 మరణించారు. తరువాత స్థానంలో గుజరాత్ లో 11, 380 కేసులు నమోదు కాగా 659 మంది మరణించారు. ఇక తమిళనాడులో గుజరాత్ లాగే 11, 224 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు 79 మంది మరణించారు. గుజరాత్, తమిళనాడులో 11 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కావడం, అయితే మరణాలో దాదాపు 90 శాతం తేడా ఉండటంతో అందరూ ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం తీరును మెచ్చుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో మరణాల సంఖ్య 659 కావడంతో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Lockdown: ప్రధాని మోదీపై దుష్ప్రచారం, మేకప్ ఎలా చేశారో చూడండి ?, చీప్ ట్రిక్స్, ఎవరో తెలిస్తే !Lockdown: ప్రధాని మోదీపై దుష్ప్రచారం, మేకప్ ఎలా చేశారో చూడండి ?, చీప్ ట్రిక్స్, ఎవరో తెలిస్తే !

 గుజరాత్ లో కరోనా హల్ చల్

గుజరాత్ లో కరోనా హల్ చల్

గుజరాత్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గుజరాత్ లో సోమవారం ఉదయం వరకు 11,380 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. గుజరాత్ లో ఇప్పటి వరకు 4,499 మంది కరోనా వైరస్ తో పోరాటం చేసి వ్యాధి నయం చేసుకున్నారు. గుజరాత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ కాటుకు 659 మంది మరణించడంతో ఇంకా 6,222 మంది కరోనా వైరస్ తో పోరాటం చేస్తున్నారు.

 తమిళనాడులో ఇది పరిస్థితి

తమిళనాడులో ఇది పరిస్థితి

తమిళనాడులో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 11,224 నమోదైనాయి. ఇప్పటి వరకు 4,172 మంది కరోనా వైరస్ వ్యాధిని జయించారు. తమిళనాడులో ఇప్పటి వరకు 6,973 కరోనా ఆక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే తమిళనాడులో కరోనా వైరస్ చికిత్స విఫలమై మరణించిన వారి సంఖ్య 79 మాత్రమే ఉంది.

ప్రపంచ దేశాల్లో ప్రధాని మోదీ హీరో !

ప్రపంచ దేశాల్లో ప్రధాని మోదీ హీరో !

భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వైరస్ అరికట్టడి విషయంలో సరైన సమయంలో లాక్ డౌన్ అమలు చేశారని, దేశ ప్రజలకు ఆ వ్యాధి ఎంత భయకంరమైనదో వివరించడంలో పూర్తిగా విజయం సాధించారని ప్రపంచ దేశాలు మెచ్చుకుంటున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల మద్దతు తీసుకోవడం వలనే భారతదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉందని ప్రపంచ దేశాలు అంటున్నాయి.

 ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో ?

ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో ?

ప్రపంచ దేశాలు మెచ్చుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఓ సమస్య ఎదురైయ్యింది. భారతదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. మహారాష్ట్ర తరువాత గుజరాత్ లో కరోనా వైరస్ మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 1,198 మంది కరోనా కాటుకు బలి అయ్యారు. తరువాత స్థానంలో గుజరాత్ ఉంది. గుజరాత్ లో ఇప్పటి వరకు 11,380 మందికి కరోనా వైరస్ సోకడంతో 659 మంది మరణించారు.

 తమిళ తంబీలు సూపర్

తమిళ తంబీలు సూపర్

తమిళనాడులో ఇప్పటి వరకు 11,224 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా వైరస్ తో పోరాటం చేసి 4,172 మంది ప్రాణాలు కాపాడుకున్నారు. తమిళనాడులో కరోనా వైరస్ మరణాల సంఖ్య కేవలం 79 మాత్రమే. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు గుజరాత్, తమిళనాడులో దాదాపు 11 వేల పైగా ఉన్న మరణాల సంఖ్యలో 580 తేడా ఉంది. అంటే గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా వైరస్ మరణాల సంఖ్య దాదాపు 90 శాతం తేడా ఉంది. తమిళనాడులో తమిళ తంబీలు అనేక జాగ్రత్తలు తీసుకోవడం, ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వానికి ప్రజలు పూర్తిగా సహకరించడం వలనే ఆ రాష్ట్రంలో కరోనా వైరస్ మరణాల సంఖ్య తక్కువగా ఉందని సమాచారం.

Recommended Video

Coronavirus Tension In Hyderabad SBI Bank, 11 Employees Sent To Quarantine
 కరోనాతో చెన్నై చిత్తడి

కరోనాతో చెన్నై చిత్తడి

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై సిటీలో కరోనా వైరస్ తాండవం చేస్తోంది. చెన్నై సిటీలో మాత్రమే ఆదివారం రాత్రి వరకు 6,750 కేసులు నమోదు అయ్యాయి. ఒక్క చెన్నై సిటీలోనే కరోనా వైరస్ చికిత్స విఫలమై నలుగురు మరణించారు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా 79 మంది మరణించారు. తమిళనాడులో ఆదివారం ఒక్కరోజు మాత్రమే 639 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. మొత్తం మీద గుజరాత్, తమిళనాడులో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 11 వేలు దాటినా మరణాలో వందల సంఖ్యలో తేడా ఉన్న విషయం వెలుగు చూసింది.

English summary
Coronavirus case of Gujarat VS Tamil Nadu: Same number of confirmed/ active/recovered cases, but vast difference in deaths.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X