వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: ఇంట్లో ఉంటే ఉగాది, లేదంటే సమాధి, ప్రాణాలతో ఉంటే వంద ఉగాదులు, సరేనా !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ బెంగళూరు: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారిని అరికట్టడానికి ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అర్దరాత్రి నుంచి 21 రోజుల పాటు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాధి వ్యాపించకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ప్రధాని నరేంద్ర మోదీ కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే మరుసటి రోజే ఉగాది పండుగ ఉండటంతో ప్రజలు రోడ్ల మీదకు వచ్చేశారు. మాకు ఉగాది పండుగ ఉందని, పండుగకు కావలసిన వస్తువులు, నిత్యవసరాల సరుకులు తీసుకోవడానికి అవకాశం ఇవ్వాలని అధికారులతో గొడవ పెట్టుకుంటున్నారు. అయితే కరోనా వైరస్ కాటు నుంచి తప్పించుకుని ప్రాణాలతో ఉంటే ఇలాంటి ఉగాదులు వంద చేసుకోవచ్చు అనే విషయం మాత్రం ప్రజలకు అర్థం కాకపోవడం విచారకరం. ఇంట్లో ఉంటే ఉగాది, లేదంటే సమాధి అనే విషయం తెలసుకోలేకపోతున్నారు. ఎలాగైనా రోడ్ల మీద తిరగాలనే తాపత్రయపడుతున్న ప్రజలు ప్రాణాలతో ఉంటే ఇలాంటి ఉగాదులు వంద చేసుకోవచ్చని గ్రహించలేకపోతున్నారు. కరోనా వైరస్ ను కట్టడి చేసే విషయంలో మాత్రం ప్రజలు చాల నిర్లక్షంగా ఉంటున్నారని అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Coronavirus: కరోనా రోగి ఉన్నాడని కాక్ పిట్ లో నుంచి దూకేసిన పైలెట్, ప్రయాణికులు ? !Coronavirus: కరోనా రోగి ఉన్నాడని కాక్ పిట్ లో నుంచి దూకేసిన పైలెట్, ప్రయాణికులు ? !

ఒక్కరోజు ఓకే, మోదీ మాట వినుంటే ?

ఒక్కరోజు ఓకే, మోదీ మాట వినుంటే ?

కరైనా వైరస్ మహమ్మారి (COVID-19) వ్యాప్తిని అరికట్టడానికి ఒక్క రోజు (ఆదివారం) దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. తరువాత దేశంలోని కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న 83 జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. అయితే ఆయా జిల్లాల్లో కరోనా వైరస్ ను అరికట్టడంలో, ప్రజలను అదుపు చెయ్యడంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, అధికారులు చూసిచూడనట్లు వ్యవహరించారని ప్రధాని నరేంద్ర మోదీడీ తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. ఈ దెబ్బకు కరోనా వైరస్ ను అరికట్టడానికి నిన్న అర్దరాత్రి (మంగళవారం అర్దరాత్రి) నుంచి 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు.

మాకు ఉగాది పండుగ ముఖ్యం !

మాకు ఉగాది పండుగ ముఖ్యం !

దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన మరుసటి రోజు ఉగాది పండుగ ఉండటంతో ప్రజలు లాక్ డౌన్ ఆదేశాలను పెడచెవిన పెట్టి రోడ్ల మీదకు వచ్చేశారు. మాకు ఉగాది పండుగ ఉందని, పండుగకు కావలసిన వస్తువులు తీసుకోవడానికి అవకాశం కల్పించాలని అధికారులతో గొడవలు పెట్టుకున్నారు. అయితే కరోనా కాటు నుంచి తప్పించుకుని ప్రాణాలతో ఉంటే ఇలాంటి ఉగాది పండుగలు వంద చేసుకోవచ్చు అనే విషయం మాత్రం ప్రజలకు అర్థం కావడం లేదు.

ఇంట్లో ఉంటే ఉగాది, లేదంటే సమాధి

ఇంట్లో ఉంటే ఉగాది, లేదంటే సమాధి

మీరు ఎక్కడుంటే అక్కడే ఉగాది పండుగ చేసుకోవాలని ప్రభుత్వాలు, అధికారులు మనవి చేస్తున్నారు. మనం ముందులాగ గతంలో చేసుకున్న ఉగాది పండుగలు వేరు, ఈ ఉగాది పండుగ వేరు అని అధికారులు అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ కాటు వెయ్యడానికి సిద్దంగా ఉందని, మనం ఆ దెబ్బ నుంచి తప్పించుకుందామని ప్రభుత్వాలు అంటున్నాయి. మీరు ఉన్న చోటే ఉన్నంతో లక్షణంగా ఉగాది పండుగ జరుపుకోవాలని, లేనివాటి గురించి పాకులాడరాదని అంటున్నారు. అయితే మాకు ఉగాది పండుగకు అల్లం కాలావి, బెల్లం కావాలి అంటూ ఏదో ఒక సాకు చెబుతూ ఇళ్ల నుంచి బయటకు వస్తున్న ప్రజలను కట్టడి చెయ్యడానికి అధికారులు నానా తంటాలు పడుతున్నారు. ఉన్న చోట ఉంటే ఉగాది, బయటకు వస్తే సమాధి అనే విషయం మాత్రం ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు.

బ్యాచిలర్స్ సహకరించండి, అర్థం చేసుకోండి !

బ్యాచిలర్స్ సహకరించండి, అర్థం చేసుకోండి !

తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది యువతీ యువకులు (బ్యాచిలర్స్) బెంగళూరు నగరంలో నివాసం ఉంటున్నారు. ఎక్కు మంది బ్యాచిలర్స్ పీజీల్లో నివాసం ఉంటున్నారు. ఇంకొందరు మాత్రం స్నేహితులతో కలిసి ఇళ్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. ఈ ఉగాది పండుగకు మాత్రం మీరు ఎక్కడ ఉన్నవాళ్లు అక్కడే ఉండాలని, కరోనా కాటు నుంచి తప్పించుకుంటే లాక్ డౌన్ గడువు పూర్తి అయిన తరువాత మీ ఊళ్లకు వెళ్లి సంతోషంగా ఉగాది పండుగ చేసుకోవచ్చని, అప్పటి వరకు అందరూ సహకరించాలని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప, ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు బ్యాచిలర్స్ కు మనవి చేస్తున్నారు.

కరోనా కాటుకు ఉగాది హాలిడే ఉందా ?

కరోనా కాటుకు ఉగాది హాలిడే ఉందా ?

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాధి తాండవం చేస్తోంది. మాకు ఉగాది పండుగ ఉంది, బయట తిరగడానికి ఒక్కచాన్స్ ఇవ్వండి అంటూ మనం అధికారులకు, పోలీసులకు చెబుతున్నాం. అయితే కరోనా వైరస్ మాత్రం ఈ రోజు ఉగాది, ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి రేపు వద్దాం లే అనుకుంటుందా ? చెప్పండి. వైరస్ కు పండుగలు, సెంటిమెంట్లు లేవని మనం తెలుసుకోవాలని, వైరస్ నుంచి తప్పించుకోవాలంటే పండుగలు, పెళ్లిళ్లు, పేరంటాలు పక్కనపెట్టాలని అనే కామన్ సెన్స్ మనకు లేకపోవడం చాలా విచారకరం అంటున్నారు పెద్దలు.

పని లేక దేశం మొత్తం లాక్ డౌన్ చేశారా ?

పని లేక దేశం మొత్తం లాక్ డౌన్ చేశారా ?

కరోనా వైరస్ నుంచి మన ప్రాణాలను కాపాడటానికి, దేశాన్ని కాపాడటానికి 21 రోజుల పాటు లాక్ డౌన్ చేశారని మనం గుర్తించాలి. అప్పుడే కరోనా కాటు నుంచి మనతో నాటు దేశం మొత్తం తప్పించుకుంటుంది. పనిపాట లేకుండా దేశం మొత్తం లాక్ డౌన్ చేశారని కొంత మంది అనుకుంటున్నారు. పోలీసులు ఇలా వచ్చి అలా వెళ్లిపోతే రోడ్ల మీదకు వచ్చి సోల్లు కబుర్లు చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో చెయ్యరాని తప్పు చేసిందని, మమ్మల్ని ఇళ్ల నుంచి బయటకు రానివ్వకుండా చేశారని విమర్శలు చేస్తున్నారు. కరోనా కాటు నుంచి చిన్నచిన్నగా చైనా తప్పించుకుంటున్నా ఇటలి, స్పెయిన్, ఇరాన్, ఫ్రాన్స్, అమెరికా లాంటి దేశాలు ఆ వైరస్ నుంచి తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయని మనం గుర్తు పెట్టుకోవాలి. అలాంటి పరిస్థితి మనకు ఎదురుకాకుండా ఉండాలంటే ఇళ్లలోనే ఉండాలనే విషయం గుర్తు పెట్టుకుంటే మనకు, మన కుటుంబాలకు, మన సమాజానికి, ఈ దేశానికి ఎంతో మంచిందని తెలుసుకోవాలి.

English summary
Coronavirus (COVID-19): Is Karnataka Government Eased Lock Down For A Day Eve Of Ugadi?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X