COVID-19: నో బెడ్, నో ఆక్సిజన్, కారులో 3 గంటలు నరకం, ఎలా వెళ్లిందో అలాగే కారులో స్మశానానికి!
నోయిడా/ చెన్నై/ లక్నో: దేశంలో కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి ఏ రైంజ్ లో తాండవం చేస్తోంది మనం చూస్తూనే ఉన్నాము. ఆసుపత్రిలో సరైన సదుపాయాలు, టైమ్ కు వైద్యం అందకపోవడంతో అయినవాళ్ల కళ్ల ముందే అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అయినవాళ్లను రక్షించుకోవడానికి ఆసుపత్రికి తీసుకెళ్లిన చాలా మంది కరోనా వైరస్ దెబ్బతో వాళ్ల కళ్ల ముందే ప్రాణాలు వదిలేస్తున్నారు.
కరోనా పాజిటివ్ తో ఆసుపత్రికి వెళ్లిన మహిళ ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో బెడ్ కోసం పాకులాడుతున్న సమయంలో నో బెడ్, నో ఆక్సిజన్ అని తెలుసుకున్నారు. అదే ఆసుపత్రి ముందు కారులో కుర్చుకుని మూడు గంటలు వైద్యం అందక నరకం అనుభవించిన మహిళ ప్రాణాలు వదిలివేయడం, అదే కారులో స్మశానికి వెళ్లడంతో అందరు చలించిపోయారు.

35 ఏళ్ల మహిళ
నోయిడాలో 35 ఏళ్ల మహిళ ఆమె భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. రెండు రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆమె వైద్యుల సలహామేరకు ఇంట్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నది. శుక్రవారం రాత్రి నుంచి ఆమె శ్వాసతీసుకోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. వైద్యుల సలహాతో ఆమె మందులు తీసుకుని ఇంట్లో ఉంది.

కారులో మూడు గంటలు
శనివారం ఆమె శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులకు గురై సతమతం అయ్యింది. వెంటనే మహిళ కుటుంబ సభ్యులు ఆమెను నోయిడాలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేర్పించడానికి కారులో పిలుచుకుని వెళ్లారు. ఆసుపత్రిలో బెడ్ లు ఖాళీ లేవని అక్కడి సిబ్బంది చెప్పారు. కుటుంబ సభ్యుల సలహామేరకు ఆసుపత్రిలో బెడ్ చిక్కుతుందని ఆశతో ఆమె ఆసుపత్రి ముందే మూడు గంటల పాటు ఆమె కారులోనే కుర్చుంది.

బెడ్ చిక్కలేదు.... ప్రాణం మిగల్లేదు
ఎంతసేపటికి ఆసుపత్రిలో బెడ్ చిక్కకపోవడంతో కారులో ఆమె నరకం అనుభవించింది. సరైన సమయంలో వైద్యం అందకపోవడంతో ఆమె కారులోనే చిత్రహింసలకు గురైంది. చివరికి ఆసుపత్రిలో బెడ్ చిక్కకపోవడంతో ఆమె కారులో కరోనా కాటుకు బలైయ్యింది. మహిళ ఎలాగుందో చూడటానికి కారు దగ్గరకు వెళ్లిన కుటుంబ సభ్యులు ఆమె ప్రాణాలు పోయాయని తెలుసుకుని ఆర్తనాదాలు చేశారు.
Recommended Video

ఇంటి నుంచి కారులో ఆసుపత్రికి... అదే కారులో స్మశానానికి
వైద్యం కోసం సొంతకారులో ఆసుపత్రికి వెళ్లిన ఆమె చివరికి శవమై అదే కారులో స్మశానం వరకు వెళ్లడం అందరి గుండెలను పిండేసింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాత్రం మాకు బెడ్ ల కోరతలేదని, అందరికి ఆక్సిజన్ అందుబాటులో ఉందని పైకి చెబుతున్నా ఇలాంటి సంఘటనలు ఆ రాష్ట్రంలో పదేపదే వెలుగు చూస్తున్నాయి. మొత్తం మీద కరోనా కాటుకు ఎవరి ప్రాణాలో ఎలా గాలిలో కలిసిపోతాయో అంటూ సామాన్య ప్రజలు హడలిపోతున్నారు.












Click it and Unblock the Notifications