వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: కరోనాకు భయపడి లేడీ ఐఏఎస్ అధికారిని రాజీనామా, వ్యక్తిగత భద్రత, బీజేపీకి షాక్ !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ యమున (హర్యానా ): కరోనా వైరస్ (COVID 19) భయంతో మహిళా ఐఏఎస్ అధికారిని రాజీనామా చేశారు. నా వ్యక్తిగత భద్రత కోసం తాను రాజీనామా చేస్తున్నానని, ఇందులో ఎలాంటి మార్పులేదని మహిళా ఐఏఎస్ అధికారిని అంటున్నారు. కరోనా వైరస్ భయంతో ఉన్నత పదవిలో ఉంటున్న మహిళా ఐఏఎస్ అధికారిని రాజీనామా చెయ్యడంతో హర్యానాలోని బీజేపీ-జేజేపీ ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలు హడలిపోయాయి. కరోనా వైరస్ భయంతో వ్యక్తిగత భద్రత కోసం మహిళా ఐఏఎస్ రాజీనామా చెయ్యడంతో దేశవ్యాప్తంగా ఈ విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది.

100 మంది అమ్మాయిలు, ఆంటీలకు వల, కామాంధుడు, నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్, పాపం లేడీ డాక్టర్!100 మంది అమ్మాయిలు, ఆంటీలకు వల, కామాంధుడు, నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్, పాపం లేడీ డాక్టర్!

ఉన్నతస్థాయి ఉద్యోగం

ఉన్నతస్థాయి ఉద్యోగం

2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారిని అయిన రాణి నగర్ (35) సమర్థవంతమైన అధికారినిగా అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నారు. ఐఏఎస్ అధికారిని రాణి నగర్ సేవలను గుర్తించిన హ్యారానా ప్రభుత్వం దస్తావేజుల శాఖలో ఉన్నతస్థానం కల్పించింది. ఆ శాఖతో పాటు సామాజిక న్యాయం, సాధికారత శాఖ అడిషనల్ డైరెక్టర్ గా రాణి నగర్ పని చేస్తున్నారు.

 కరోనా వైరస్ భయం ?

కరోనా వైరస్ భయం ?

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ దెబ్బకు అందరూ గజగజ వనికిపోతున్నారు. ఇదే కరోనా వైరస్ భయంతో ప్రభుత్వ ఉద్యోగులు చాలా మంది ఉద్యోగాలు చెయ్యాలంటే ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా వైద్యులు, పారిశుద్ద కార్మికులు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, పోలీసులతో పాటు నిత్యం ప్రజా సేవలో ఉంటున్న ఉన్నతస్థాయి అధికారులు హడలిపోతున్నారు.

 రాణి నగర్ కు అదే భయం

రాణి నగర్ కు అదే భయం

హర్యానా ఐఏఎస్ అధికారిని రాణి నగర్ సైతం కరోనా వైరస్ తో ఆందోళన చెందుతున్నారని తెలిసింది. నిత్యం ప్రజాసేవలో ఉంటున్నందున ఒకవేళ కరోనా వైరస్ సోకితే తనతో పాటు తన కుటుంబ సభ్యులకు ఆ వ్యాధి సోకే అవకాశం ఉందని రాణి నగర్ ఆమె సన్నిహితుల దగ్గర ఆందోళన వ్యక్తం చేశారని తెలిసింది.

 సీఎం, గవర్నర్, సీఎస్ కు లేఖ

సీఎం, గవర్నర్, సీఎస్ కు లేఖ

ఐఏఎస్ అధికారిని రాణి నగర్ ఆమె రాజీనామా లేఖను హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేష్ని ఆనంద్ అరోరాకు పంపించారు. తన రాజీనామా లేఖను వెంటనే ఆమోదించాలని, అలాగే కేంద్ర ప్రభుత్వానికి తన రాజీనామా లేఖను పంపించాలని ఐఏఎస్ అధికారిని రాణి నగర్ హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేష్ని ఆనంద్ అరోరాకు మనవి చేశారు. తన రాజీనామాల లేఖను ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో పాటు గవర్నర్ కు పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేష్ని ఆనంద్ అరోరాకు ఐఏఎస్ అధికారిని రాణి నగర్ మనవి చేశారు.

 వ్యక్తిగత భద్రత కోసం !

వ్యక్తిగత భద్రత కోసం !

మహిళా ఐఏఎస్ అధికారిని రాణి నగర్ రాజీనామా లేఖలో కేవలం వ్యక్తిగత భద్రత కోసం రాజీనామా చేస్తున్నానని మాత్రమే రాశారని, ఆ లేఖలో పూర్తి సమాచారం లేదని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి అంటున్నారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో పాటు ఆ రాష్ట్రంలోని బీజేపీ-జేజేపీ ప్రభుత్వ పెద్దలు ఐఏఎస్ అధికారిని రాణి నగర్ రాజీనామా విషయంపై పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. రాణి నగర్ రాజీనామాతో తాము షాక్ తిన్నామని హర్యానాలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

 లాక్ డౌన్ తరువాతే వివరిస్తా !

లాక్ డౌన్ తరువాతే వివరిస్తా !

లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత ప్రభుత్వం, తన సీనియర్ అధికారులను కలిసి తాను ఎందుకు రాజీనామా చేశాను ? అనే విషయంపై వివరణ ఇస్తానని రాణి నగర్ తన ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. మార్చి 4వ తేదీన రాణి నగర్ ఆమె రాజీనామా లేఖను హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేష్ని ఆనంద్ అరోరాకు పంపించారు. అయితే ఐఏఎస్ అధికారిని రాణి నగర్ రాజీనామా వెనుక మరొకరి ప్రమేయం ఉందా ?, ఎవరైనా ఒత్తిడి చేశారా ? అంటూ హర్యానా ప్రభుత్వ పెద్దలు ఆరా తీస్తున్నారని తెలిసింది.

English summary
A 2014-batch IAS officer of the Haryana cadre resigned, citing personal safety on government duty as the reason for it. The Opposition Congress termed her resignation shocking, asking Chief Minister Manohar Lal Khattar if it was not a proof of his failure. Rani Nagar (35) currently held the charge of the director, Archives Department, and the additional director, social justice and empowerment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X