వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా: వైరస్‌తో తల్లి కర్మ ఫంక్షన్, 11 మందికి పాజిటివ్, 1500 మంది హాజరు, ప్లేస్ సీజ్..

|
Google Oneindia TeluguNews

అంటు వ్యాధి కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఇటీవల దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి.. తన తల్లి దశదిశ కర్మ నిర్వహించారు. బంధువులను పిలువడంతో ఫంక్షన్‌కు 1500 మంది వరకు హాజరయ్యారు. అతని, భార్యకు వైరస్ సోకడంతో.. ఫంక్షన్ హాజరైన వారికి కూడా వైరస్ వచ్చింది. దీంతో అక్కడి నుంచి స్థానికులను ఖాళీ చేయించారు. ఆ ప్రాంతాన్ని సీజ్ చేశారు.

దుబాయ్ నుంచి రాక..

దుబాయ్ నుంచి రాక..

మెరెనా జిల్లాకు చెందిన వ్యక్తి మార్చి 17వ తేదీన దుబాయ్ నుంచి వచ్చాడు. 20వ తేదీన కర్మ నిర్వహించాడు. తన డాబు దర్పం చూపిద్దామనుకొని.. 1500 మంది అతిథులను పిలిచాడు. వారంతా ఆనందంగా గడిపారు. కానీ కరోనా వైరస్ రక్కసి దాగి ఉందనే విషయాన్ని గమనించలేకపోయారు. 20వ తేదీన ఫంక్షన్ ముగిసిన తర్వాత.. మెల్లగా వైరస్ బయటపడింది.

4 రోజుల తర్వాత..

4 రోజుల తర్వాత..

అతనికి వైరస్ సోకిన ఇంట్లోనే ఉండిపోయాడు. 20వ తేదీ నుంచి నాలుగురోజులు కాలం వెళ్లదీశాడు. 25వ తేదీన ఆస్పత్రికి వెళ్లడంతో వైరస్ బయటపడింది. అతనితోపాటు భార్యకు కూడా పాజిటివ్ రావడంతో క్వారంటైన్‌కు తరలించారు. తర్వాత వారి బంధువులకు పరీక్షలు నిర్వహించారు. 23 మందిని పరీక్షించగా 10 మందికి పాజిటివ్ వచ్చింది.

 8 మంది మహిళలే

8 మంది మహిళలే

పది మందిలో ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. మిగతా 12 మందిని క్వారంటైన్‌కు తరలించారు. వారి బంధువుల్లో నెగిటివ్ వచ్చిన వారిని కూడా ఐసోలేషన్ తరలించినట్టు అధికారులు తెలిపారు. 14 రోజుల తర్వాత.. పరీక్షలు చేసి.. వారిని బయటకు వెళ్లేందుకు అనుమతిస్తామని చెప్పారు. మెరెనా జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో వారిని తరలించామని పేర్కొన్నారు.

Recommended Video

Watch : Rohit Sharma's Daughter Imitates Jasprit Bumrah's Bowling
భార్య ద్వారానే..

భార్య ద్వారానే..

దుబాయ్ నుంచి వచ్చే సమయంలో అతనికి పరీక్షలు చేయగా.. నెగిటివ్ వచ్చింది. కానీ అతని భార్య మాత్రం మార్చి 15వ తేదీ నుంచి అస్వస్ధతతో ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఆమె ద్వారా వైరస్ వ్యాపించిందని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 2 వేల 547 మందికి సోకగా.. 62 మంది చనిపోయారు. మధ్యప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు 154 మందికి చేరాయి. ఢిల్లీలో జరిగిన మతసభల తర్వాత రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరిగాయి.

English summary
Dubai-returned man and 11 of his family members have tested coronavirus positive in Madhya Pradesh's Morena district, days after he organised a feast for 1,500 people in the honour of his dead mother.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X