కరోనా విలయం: భారీగా కేసులు నమోదు.. అలర్ట్
కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ చాలాానే ఉంది. డబ్యూహెచ్‌వో సూచనలతో దేశాలు నడచుకుంటున్నాయి. కరోనా తీవ్రంగా ఉందని కేంద్రం కూడా అప్రమత్తం అయ్యింంది. వైరస్ ఎక్కువ ఉన్న చోట సిబ్బందిని మరింత అలర్ట్ చేసింది. కరోనా వల్ల యావత్ దేశానికి ప్రమాదం పొంచి ఉందని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. దేశంలో కరోనా విజృంభిస్తోందని.. నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు.

గత నాలుగు వారాల నుంచి పరిస్థితి మారిపోయింది. కరోనా ఎక్కువగా ఉన్న జిల్లాలు మహారాష్ట్ర, డిల్లీలో ఉన్నాయి. పుణెలో 59 వేల మంది, ముంబై 46 వేల మంది నాగ్ పూర్ 45, నాసిక్ 26 వేల మంది, ఔరంగబాద్ 21 వేలు, బెంగళూర్ అర్బన్ 16 వేల మంది. నాందేడ్ 15 వేల మంది, డిల్లీ 8 వేల మంది, అహ్మద్ నగర్ 7 వేల మందికి పాజిటివ్ వచ్చింది. మిగతాచోట్ల కూడా కరోనా ప్రభావం ఉంది. జనాలను కాపాడేందుకు రంగంలోకి దిగాల్సిన అవసరం ఎంతయినా ఉంది.