Coronavirus: కేరళలో మూడో కేసు: వుహాన్ నుంచి వచ్చిన మలయాళీ మహిళకు పాజిటీవ్ రిపోర్ట్..!
Recommended Video
తిరువనంతపురం: కేరళలో మూడో కరోనా వైరస్ కేసు నమోదైంది. చైనాలోని వుహాన్ సిటీ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన ఓ మహిళకు పరీక్షలను నిర్వహించగా.. పాజిటీవ్‌గా తేలింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, డాక్టర్ల సంరక్షణలో ఉన్నారని కేరళ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ వెల్లడించారు. కాసర్‌గోడ్ జిల్లాకు చెందిన బాధితురాలి పూర్తి వివరాలను ఇప్పటికిప్పుడు వెల్లడించలేమని చెప్పారు.
కరోనా వైరస్ ప్రబలడానికి కేంద్రబిందువైన వుహాన్ సిటీ నుంచి బాధితురాలు కొద్దిరోజుల కిందటే కాసర్‌గోడ్‌కు చేరుకున్నారని, అనారోగ్యానికి గురైన ఆమెను డాక్టర్లు వైద్య పరీక్షలను నిర్వహించగా.. కరోనా వైరస్ సోకినట్టు తేలందని శైలజ తెలిపారు. ప్రస్తుతం ఆమెను ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటిదాకా మొత్తం 104 రక్తనమూనాలను తాము పుణేలోని వైరాలజీ ఆసుపత్రికి పంపించామని, వాటి నివేదికలు ఇంకా అందాల్సి ఉందని అన్నారు.

చైనా నుంచి స్వరాష్ట్రానికి తిరిగి వచ్చిన వారి కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామని అన్నారు. స్థానిక అధికారులకు గానీ, వైద్య శిబిరాన్ని పర్యవేక్షిస్తున్న సిబ్బందికి గానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అక్కడ వైద్య పరీక్షలను పొందుతున్న వారెవ్వరూ స్వస్థలాలకు వెళ్లకుండా నిషేధించామని అన్నారు. రక్త నమూనాల పరీక్షలు నెగెటివ్‌గా తేలిన తరువాతే.. వారికి ఇళ్లకు పంపిస్తామని చెప్పారు.

కాగా- కేరళలో వెలుగులోకి వచ్చిన మూడో కరోనా వైరస్ కేసు ఇది. కిందటి నెల 30వ తేదీన అక్కడ తొలి కేసు నమోదైంది. మూడు రోజుల వ్యవధిలో రెండో పాజిటీవ్ కేసు వెలుగులోకి వచ్చింది. కరోనా వైరస్ బారిన పడిన ఆ ఇద్దర్నీ వేర్వేరు ఆసుపత్రల్లో ఉంచి చికిత్సను నిర్వహిస్తున్నారు. త్రిశూర్ మెడికల్ కాలేజీ, అళప్పుజ మెడికల్ కాలేజీల్లో వారు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. ముందు జాగ్రత్త చర్యగా కేరళ ప్రభుత్వం తిరువనంతపురం సహా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసింది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications