వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ దగ్గు మందులో విషం! 9 మంది చిన్నారులు మృతి: 8 రాష్ట్రాల్లో వెనక్కి, కంపెనీ క్లోజ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అదొక దగ్గు మందు(కాఫ్ సిరప్). కానీ, ఆ మందు తాగిన తొమ్మిది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జమ్మూకాశ్మీర్‌లో జనవరి నెలలో చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ దగ్గు మందు.. కోల్డ్‌బెస్ట్-పీసీని ఉత్పత్తిదారైన డిజిటల్ విజన్ ఫార్మాసూటికల్స్‌పై అధికారులు చర్యలు తీసుకున్నారు.

ఆ దగ్గు మందులు విషపూరిత పదార్థం..

ఆ దగ్గు మందులు విషపూరిత పదార్థం..

హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన డిజిటల్ విజన్ ఫార్మాసూటికల్స్.. కోల్డ్‌బెస్ట్ పీసీని తమిళనాడుతోపాటు దేశంలోని 9 రాష్ట్రాల నుంచి వెనక్కి తీసుకుంది. ఈ మందులో ప్రాణాంతకమైన రసాయనాలున్న కారణంగానే 9 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని ప్రాథమిక విచారణలో తేలడం గమనార్హం. డైథీలిన్ గ్లైకోల్ అనే విషపూరిత, కలుషిత పదార్థాలు ఉన్న కారణంగానే ఈ మందు తాగిన 9 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని అసిస్టెంట్ డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ది డ్రగ్ అండ్ ఫుడ్ కంట్రోల్ ఆర్గనైజేషన్-జమ్మూకాశ్మీర్.. సురీందర్ మోహన్ వెల్లడించారు. ఈ మేరకు తమ విచారణలో వెల్లడైందని తెలిపారు.

8 రాష్ట్రాల నుంచి మందులు వెనక్కి..

8 రాష్ట్రాల నుంచి మందులు వెనక్కి..

జమ్మూకాశ్మీర్ తోపాటు ఎనిమిది రాష్ట్రాలకు ఇప్పటికే ఈ మందులు సరఫరా కావడంతో వాటిని సదరు కంపెనీ వెనక్కి తీసుకునేందుకు నోటీసులు అధికారులు నోటీసులు పంపారు. కంపెనీ నెలకొల్పబడిన హిమాచల్‌ప్రదేశ్ తోపాటు జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, త్రిపుర, మేఘాలయ, తమిళనాడు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేశారు అధికారులు. కలుషితమైన ఈ సిరప్‌ పంపిణీని నిలిపివేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని, ఈ సిరప్‌ను వాడకూడదని ఇప్పటికే ఆరోగ్యశాఖ సంబంధించిన అధికారులందరికీ సమాచారం ఇచ్చామని తిరుచ్చి అధికారులు తెలిపారు.

కోల్డ్ బెస్ట్ పీసీ ఉత్పత్తుల నిలిపివేత..

కోల్డ్ బెస్ట్ పీసీ ఉత్పత్తుల నిలిపివేత..

కాగా, ఆ సిరప్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు ఫార్మాసూటికల్ కంపెనీ అధికారులు వెల్లడించారు. సిరప్ పంపిణీని కూడా నిలిపివేశామని, డ్రగ్ కంట్రోల్ అధికారులకు కూడా సమాచారం అందించామని తెలిపారు. జమ్మూకాశ్మీర్‌లోని ఉధమ్‌పూర్ జిల్లాలో ఈ సిరప్ తాగిన 9 మంది చిన్నారులు మృతి చెందగా, మరో ఆరుగురు అనారోగ్యం పాలయ్యారు. విచారణ చేపట్టిన ఆరోగ్య శాఖ అధికారులు.. కోల్డ్‌బెస్ట్ పీసీ కాఫ్ సిరప్ కారణంగానే ఈ మరణాలు సంభవించాయని గుర్తించారు. డైథీలిన్ గ్లైకోల్ అనే విషపూరిత పదార్థం ఈ సిరప్‌లో ఉందని పరీక్షల్లో తేలింది.

Recommended Video

Suspended DSP Davinder Singh brought to NIA court in Jammu | Oneindia Telugu
ఆ ఫార్మా కంపెనీ క్లోజ్..

ఆ ఫార్మా కంపెనీ క్లోజ్..

ఈ నేపథ్యంలో డిజిటల్ విజన్‌కు ఉన్న ఈ మందుల తయారీ అనుమతిని రద్దు చేసింది ప్రభుత్వం. అంతేగాక, 5వేలకు పైగా సిరప్ యూనిట్లను వెనక్కి రప్పించాలని ఆదేశాలు జారీ చేసింది. సిరప్ ఉత్పత్తును ఈ కంపెనీలో నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, డిజిటల్ విజన్స్‌కు ఇలాంటి మందులు తయారు చేయడం, అధికారుల నుంచి మందలింపులను ఎదుర్కోవడం కొత్తేమీ కాదు. ఈ కంపెనీ తయారు చేసిన సబ్పర్ డ్రగ్స్ నాణ్యత పరీక్షల్లో విఫలం కావడం గమనార్హం. రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ లాంటి రాష్ట్రాల్లో 2014-2019 మధ్య కాలంలో నిర్వహించిన పరీక్షల్లో విఫలమైంది.

English summary
A recall for a cough syrup – Coldbest-PC – produced by Digital Vision Pharmaceuticals based out of Himachal Pradesh,has been issued in Tamil Nadu and seven other states in the country after preliminary investigations revealed that the syrup was contaminated and allegedly led to the death of nine children in Jammu and Kashmir earlier in January.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X