రాష్ట్రపతి ఎన్నికలు: తొలి రౌండులోనే మీరా కుమార్ ను వెనక్కు నెట్టేసిన రామ్ నాథ్ కోవింద్!

రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొద్ది సేపటి క్రితం పార్లమెంటు హౌస్ లో ప్రారంభమైంది. తొలి రౌండులోనే మీరా కుమార్ ను వెనక్కు నెట్టేసిన రామ్ నాథ్ కోవింద్ ఆధిక్యంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది

న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొద్ది సేపటి క్రితం పార్లమెంటు హౌస్ లో ప్రారంభమైంది. తొలి రౌండులోనే మీరా కుమార్ ను వెనక్కు నెట్టేసిన రామ్ నాథ్ కోవింద్ ఆధిక్యంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది.

బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ తరఫున రామ్ నాథ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రసివ్ అలయన్స్ తరఫున మీరా కుమార్ లు రాష్ట్రపతి పదవికి పోటీ పడ్డ సంగతి తెలిసిందే.

 Counting begins; Will it be Ram Nath Kovind or Meira Kumar?

మొత్తం 4,120 మంది ఎమ్మెల్యేలు, 776 మంది ఎంపీలకు ఓటు హక్కు ఉండగా, 99 శాతం ఓటింగ్ నమోదైంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటైన 32 పోలింగ్ స్టేషన్ల నుంచి తెచ్చిన బ్యాలెట్ బాక్సుల్లో ఒక్కొక్కటీ ఓపెన్ చేసి ఓట్లను లెక్కించనున్నారు.

నేటి సాయంత్రం 5 గంటలలోగా పూర్తి ఫలితాలు వెలువడవచ్చు. అందరి అంచనాల ప్రకారం దేశ 14వ రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ గెలుపు ఖాయం. మీరా కుమార్ పై భారీ మెజారిటీతో ఆయన గెలుస్తారని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+