Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆంటీ, అంకుల్ లవ్ స్టోరి, అక్రమ సంబంధం, ఫ్యామిలీ గాలికి, ఇద్దరికి వార్నింగ్, బీచ్ లో విషం తాగి!

చెన్నై: వివాహేతర సంబంధంతో కుటుంబ సభ్యులు మందలించారని ఆవేదనతో వివాహేతర జంట ఆత్మహత్య చేసుకున్నారు. దైవ దర్శనం చేసుకున్న తరువాత ఆంటీ, అంకుల్ బీచ్ లో సంచరించి అక్కడే విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. వివాహేతర జంట ఫ్యామిలీలలను గాలికి వదిలేసి ఆత్మహత్య చేసుకోవడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. అక్రమ సంబంధం వలన తాము మందలించామని, అందుకే వారు ఆత్మహత్య చేసుకున్నారని ఇరు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

రెండు కాపురాలు, నలుగురు పిల్లలు

రెండు కాపురాలు, నలుగురు పిల్లలు

తమిళనాడులోని విరుద్ నగర్ జిల్లా శివకాశి అమ్మన్ కోయిల్ పట్టిలో గణేశ్ ముత్తు (45), విజయరాణి (42) దంపతులు నివాసం ఉంటున్నారు. గణేశ్ ముత్తు, విజయరాణి దంపతులకు 17 ఏళ్ల కుమారుడు, 15 ఏళ్ల కుమార్తె ఉన్నారు. శివకాశి సమీపంలోని సామిపురంలో లక్ష్మణన్ (47), జయలక్ష్మి (45) దంపతులు నివాసం ఉంటున్నారు. లక్ష్మణన్, జయలక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

 ఆంటీ అంకుల్ లవ్ స్టోరి

ఆంటీ అంకుల్ లవ్ స్టోరి

గణేశ్ ముత్తు, జయలక్ష్మి ఒకే చోట ఉద్యోగం చేస్తున్నారు. ఒకే చోట ఉద్యోగం చెయ్యడంతో గణేశ్ ముత్తు, జయలక్ష్మిల మధ్య పరిచయం అయ్యింది. గణేశ్ ముత్తు, జయలక్ష్మిల పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసింది. గణేశ్ ముత్తు, జయలక్ష్మి ఒకరిని ఒకరు వదిలి ఉండలేకపోయారు.

వార్నింగ్ ఇచ్చిన ఫ్యామిలీ

వార్నింగ్ ఇచ్చిన ఫ్యామిలీ

గణేశ్ ముత్తు ఇంటికి రాకుండా జయలక్ష్మితో జల్సాలు చేస్తున్న విషయం అతని భార్య విజయరాణికి తెలిసింది. తన భర్త గణేశ్ ముత్తు సక్రమంగా ఇంటికి రావడం లేదని, జయలక్ష్మితో జల్సాలు చేస్తున్నాడని బావ రామర్ కు (గణేశ్ ముత్తు సోదరుడు) చెప్పింది. తమ్ముడు గణేశ్ ముత్తును పిలిచి జయలక్ష్మితో దూరంగా ఉండాలని, లేదంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని అన్న రామర్ హెచ్చరించాడు. తన భార్య జయలక్ష్మి అక్రమ సంబంధం సాగిస్తుందని తెలుసుకున్న లక్ష్మణన్ సైతం భార్యకు బుద్దిగా ఉండాలని హెచ్చరించాడు.

ఆత్మహత్య చేసుకుందాం రా!

ఆత్మహత్య చేసుకుందాం రా!

కుటుంబ సభ్యులు హెచ్చరించడంతో గణేశ్ ముత్తు, జయలక్ష్మి కలత చెందారు. కుటుంబ సభ్యులకు దూరంగా మనం ఉండలేమని, అలాగని విడిపోయి జీవించలేమని గణేశ్ ముత్తు, జయలక్ష్మి నిర్ణయించారు. ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకుంటే ఎవ్వరికి ఏ సమస్య ఉండదని గణేశ్ ముత్తు, జయలక్ష్మి నిర్ణయించారు.

బీచ్ లో విషం సేవించి!

బీచ్ లో విషం సేవించి!

ప్రేమ జంట గణేశ్ ముత్తు, జయలక్ష్మి ఇళ్లు వదిలి తిరుచెందూరు చేరుకున్నారు. తిరుచెందూరులోని మురుగన్ ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి దైవ దర్శనం చేసుకున్న గణేశ్ ముత్తు, జయలక్ష్మి నేరుగా నాళికినరు ప్రాంతంలోని సముద్ర తీరంలోని బీచ్ చేరుకున్నారు. బీచ్ లో ఉల్లాసంగా తిరిగిన గణేశ్ ముత్తు, జయలక్ష్మి అక్కడే ఇద్దరు కలిసి విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. మరుసటి రోజు శవాలు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గణేశ్ ముత్తు జోబులో ఉన్న కొన్ని కాగితాల ఆధారంగా ఇద్దరి అడ్రస్ లు సేకరించిన పోలీసులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+