వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దోషి: జయలలిత రాజీనామా, సిఎం రేసులో వీరే?

By Pratap
|
Google Oneindia TeluguNews

చెన్నై: ఆస్తుల కేసులో దోషిగా తేలిన నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రాజకీయ భవిష్యత్తు ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. శిక్ష ఖరారు చేసిన తర్వాత జయలలిత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి రేసులో మంత్రులు షీలా బాలకృష్ణన్, బాలాజీ, పన్నీర్ సెల్వం ఉన్నారు.

తన దత్తపుత్రుడు సుధాకర్ పెళ్లికి 1996లో జయలలిత ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేశారనేది కేసులో ప్రధాన ఆరోపణ. జయలలిత ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటే షీలా బాలకృష్ణన్ తాత్కాలిక ముఖ్యమంత్రిగా నియమించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

Court verdict: Jayalalithaa to resign

అక్రమాస్తుల కేసులో జయలలిత దోషిగా తేలిన నేపథ్యంలో డిఎంకె కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. డిఎంకె కార్యకర్తలు స్వీట్లు పంచుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటున్నారు. కరుణానిధి నివాసంలో డిఎంకె నేతల కీలక సమావేశం ఏర్పాటైంది. స్టాలిన్‌తో పాటు పలువురు నాయకులు ఈ భేటీలో పాల్గొన్నారు.

జయలలితను ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించడంతో అన్నాడియంకె కార్యకర్తలు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. లాకు ఆందోళనలకు దిగారు. దీంతో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో ఆందోళనకారులు బారికేడ్లను విరగ్గొట్టారు. తమిళనాడులో బంద్ వాతావరణం నెలకొంది. పలు ప్రాంతాల్లో అన్నాడియంకె కార్యకర్తలు దాడులకు దెగబడ్డారు.

English summary
Tamil Nadu CM jayalalitha resigning for the post in the wake of Bangalore special court verdict, may nominate Sheila Balakrishnan as mid term CM
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X