ఇక గర్భిణీలకూ కొవిడ్ వ్యాక్సిన్ -కేంద్రం అనుమతి -కొవిన్ ద్వారా లేదా నేరుగా -కరోనా కొత్త వేరియంట్ల విజృంభణతో

కరోనా వైరస్ కొత్త వేరియట్ల విజృంభణ, మూడో వేవ్ భయాల నేపథ్యంలో దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గర్భిణీలకు కూడా టీకాలు ఇచ్చేందుకు సర్కారు అనుమతిఇచ్చింది. ఇప్పటివరకు కేవలం చిన్నపిల్లల తల్లులకు మాత్రమే టీకా ఇచ్చేందుకు అనుమతించిన కేంద్రం..

తాజాగా గర్భిణీలకు కూడా టీకాలు ఇవ్వాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ఒక ప్రకటన చేసింది. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోగోరే గర్భిణులు కొవిన్ పోర్టల్ ద్వారా పేరు నమోదు చేసుకోవచ్చని లేదా నేరుగా సమీప వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లి టీకాలు పొందొచ్చని ప్రభుత్వం పేర్కొంది.

 covid-19: Centre permits pregnant women to get vaccinated, CoWIN Registration, Walk-In Allowed

దేశవ్యాప్తంగా 18ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్‌ ఇచ్చే కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. కానీ, గర్భిణీ స్త్రీలపై విస్తృత ప్రయోగాల వివరాలు లేకపోవడంతో వీటిపై నిర్ణయం తీసుకోలేదు. ఇదే సమయంలో వైరస్‌ బారినపడుతున్న గర్భిణీ స్త్రీల సంఖ్య పెరగడం.. రానున్న రోజుల్లోనూ థర్డ్‌వేవ్‌ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ ఈ విషయంపై మరోసారి చర్చించింది.

 covid-19: Centre permits pregnant women to get vaccinated, CoWIN Registration, Walk-In Allowed

గర్భిణీలకు కూడా వ్యాక్సిన్‌ ఇవ్వవచ్చని నేషనల్‌ టెక్నికల్‌ అడ్వయిజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌ సిఫార్సు చేయడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కరోనా ముప్పు అందరికీ పొంచివున్న నేపథ్యంలో గర్భిణీలకు టీకా ఎంతో ముఖ్యమని, తప్పకుండా వారికి అందించాల్సిందేనని ఐసీఎంఆర్‌ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే, వ్యాక్సిన్‌ ఇచ్చే ముందు వాటి వల్ల కలిగే దుష్ర్పభావాలను వారికి వివరించాల్సి ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+