డాక్టర్లనూ వదలని కరోనా-మరణాల్లో బీహార్, యూపీ, ఢిల్లీ టాప్ : ఐఎంఏ రిపోర్ట్
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపుతోంది. సాధారణ ప్రజలే కాదు వారికి తమ ప్రాణాల్ని అడ్డుపెట్టి మరీ వైద్యం చేస్తున్న డాక్టర్లు కూడా కోవిడ్‌కు బలైపోతున్నారు. ఇలా పలు రాష్ట్రాల్లో కోవిడ్ కారణంగా డాక్టర్లు కూడా మృత్యువాత పడుతున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తాజాగా ప్రకటించింది.
Recommended Video
కరోనా కారణంగా డాక్టర్లు ఎక్కువగా మృత్యువాత పడిన రాష్ట్రాలు ఎక్కువగా ఉత్తరాదిలోనే ఉన్నాయి. అత్యధికంగా బీహార్‌లో 69 మంది డాక్టర్లు కరోనా కారణంగా చనిపోయారు. ఆ తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌లో 34మంది, ఢిల్లీలో 27మంది వైద్యులు కరోనాకు బలైపోయినట్లు ఐఎంఏ తాజా నివేదికలో వెల్లడించింది. దీంతో డాక్టర్లు కూడా ప్రాణాలు అరచేత్తో పట్టుకుని వైద్యం చేయాల్సిన పరిస్ధితులు దాపురించినట్లు అర్ధమవుతోంది.

ఇప్పటివరకూ కరోనా సెకండ్ వేవ్‌లో దేశవ్యాప్తంగా 244మంది డాక్టర్లు చనిపోయినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రిజిస్ట్రీ వెల్లడించింది. ఇందులో ఢిల్లీకి చెందిన పాతికేళ్ల డాక్టర్ అనాస్ మిజాహిద్ అత్యల్ప వయస్సులో చనిపోయినడాక్టర్‌గా తెలిపింది. అలాగే కోల్‌కతాకు చెందిన 87 ఏళ్ల అనిల్ కుమార్ రక్షిత్ అనే డాక్టర్ కరోనాతో చనిపోయిన అత్యధిక వయసు కలిగిన డాక్టర్‌గా ఐఎంఏ గుర్తించింది. గతేడాది మొత్తంలో కరోనా కారణంగా 730 డాక్టర్లు చనిపోయారని, ఇప్పుడు కేవలం ఐదునెలల వ్యవధిలోనే 244 మంది చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ జాబితాలో ఏపీలో 21 మంది, తెలంగాణలో 19 మంది డాక్టర్లు కూడా ఉన్నారు.












Click it and Unblock the Notifications