• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా విలయం: Kerala చుట్టూ ఆంక్షలు -టెస్టు లేనిదే Tamil Naduలోకి నో ఎంట్రీ - Karnataka కూడా

|

'కేరళలో ఇవాళ జరిగింది రేపు దేశంలో జరుగుతుంది'అనే నానుడిని నిజం చేస్తూ, కేరళలో కరోనా మళ్లీ తిరగబెట్టగా, దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ కొత్త కేసులు మెల్లగా పెరుగుతున్నాయి. గడిచిన వారం రోజులుగా కేరళలో కొత్త కేసులు 20వేల పైచిలుకు వస్తుండటం, దేశంలో కొవిడ్ మూడో వేవ్ కు ఆ రాష్ట్రమే కేంద్రంగా మారుతుందనే అంచనాల నడుమ పొరుగు రాష్ట్రాలు అలర్ట్ అవుతున్నాయి. కేరళ నుంచి వస్తోన్న ఎంట్రీలపై చుట్టు పక్కల రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా..

  Covid 19 Third Wave : ధర్డ్ వేవ్ పై కేంద్రం తాజా హెచ్చరికలు..!! || Oneindia Telugu

  Friendship Day:మోదీ ఇద్దరు మిత్రులు -ప్రధానికి రాహుల్ గాంధీ విష్ మామూలుగా లేదుగా -viral videoFriendship Day:మోదీ ఇద్దరు మిత్రులు -ప్రధానికి రాహుల్ గాంధీ విష్ మామూలుగా లేదుగా -viral video

  తమిళనాడులో రోజురోజుకూ కరోనా కొత్త కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్టాలిన్ సర్కారు అప్రమత్తమైంది. వైరస్‌ కట్టడి చర్యల్లో భాగంగా ఆదివారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా, కేరళ నుంచి తమిళనాడుకు వచ్చేవారు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్‌ టెస్టు నెగెటివ్‌ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుందని స్టాలిన్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. గడిచిన వారం రోజుల్లో కేరళలో 20 వేల కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూడటం, కేరళలోని 8 జిల్లాలలో సరిహద్దును పంచుకుంటోన్న దరిమిలా తమిళనాడు ప్రభుత్వం ఈ మేరకు ఆంక్షలు విధించింది.

   covid-19: Tamil Nadu makes RT-PCR test mandatory for people arriving from Kerala

  కేరళ నుంచి తమిళనాడులోకి అడుగు పెట్టాలంటే ఆర్టీపీసీఆర్ నెగటివ్ రిపోర్టు తప్పనిసరి ప్రక్రియ ఈ నెల 5 నుంచి అమల్లోకి వస్తుందని, ఆర్టీ-పీసీఆర్ నెగటివ్ రిపోర్టు లేనిదే వ్యక్తులను అనుమతించబోమని తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి ఎమ్‌ఏ సుబ్రమణియన్‌ వెల్లడించారు. మూడు రోజులుగా తమిళనాడులో కొవిడ్ కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో రాష్ట్రంలోనూ ఆర్టీపీసీఆర్‌ పరీక్షల సంఖ్యను పెంచామన్నారు.

  కొవిడ్ వ్యాప్తిని నివారించేందుకు ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాలు కీలకమైనవన్న మంత్రి సుబ్రమణియన్.. ప్రజలు బాధ్యతను మరచి మాస్కులు ధరించకుండా సంచరిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేసినట్టు పేర్కొన్నారు. కాగా, కేరళ నుంచి రాకలపై తమిళనాడు ఆంక్షలు విధించడానికి రెండ్రోజుల ముందే కర్ణాటక ఇదే తరహా నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

  ఈశాన్యంలో రక్తపాతం: ప్రధాని మోదీపై మణిపూర్ సీఎం బీరేన్ కీలక వ్యాఖ్యలు -బీజేపీలోకి మాజీ పీసీసీ చీఫ్ఈశాన్యంలో రక్తపాతం: ప్రధాని మోదీపై మణిపూర్ సీఎం బీరేన్ కీలక వ్యాఖ్యలు -బీజేపీలోకి మాజీ పీసీసీ చీఫ్

  కేరళ, మహారాష్ట్రల్లో కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఆ రెండు రాష్ట్రాల నుంచి కర్ణాటకకు వచ్చే ప్రయాణికులకు ఆర్టీ పీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్ట్‌ తప్పనిసరి చేసింది. టీకాలతో సంబంధం లేకుండా 72 గంటల్లోపు తీసుకున్న రిపోర్ట్‌ను సమర్పించాలని స్పష్టం చేసింది. విమానాలు, బస్సులు, రైళ్లు, వ్యక్తిగత వాహనాల ద్వారా వచ్చే ప్రయాణికులందరికీ నెగెటివ్‌ రిపోర్ట్‌ తప్పనిసరని చెప్పింది. కేరళ, మహారాష్ట్రల్లో ప్రారంభమయ్యే అన్ని విమానాలకు వర్తిస్తుందని, 72గంటలకు మించకుండా ఉన్న ఆర్‌టీ పీసీఆర్‌ నెగెటివ్‌ సర్టిఫికెట్లు ఉన్న ప్రయాణికులకే విమానయాన సంస్థలు బోర్డింగ్‌ పాస్‌లు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

  English summary
  In a bid to prevent a surge in Covid cases, the Tamil Nadu government on Sunday made negative RT-PCR test report mandatory for people coming to the state from Kerala. “RT-PCR report mandatory for people coming from Kerala to Tamil Nadu from August 5”, state Health Minister, Ma Subramanian made the announcement today. Karnataka tightens Covid rules for passengers from Maharashtra, Kerala.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X