కోవీషీల్డ్ డోసుల గ్యాప్‌ 12-16 వారాలకు పెంపు-కేంద్రం నిర్ణయంపై నిపుణుల విస్మయం-వ్యాక్సిన్ల కొరతే కారణమా?

కోవీషీల్డ్ వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవీషీల్డ్ మొదటి డోసుకు,రెండో డోసుకు మధ్య గ్యాప్‌ను 12-16 వారాలకు పెంచింది. ఇంతకుముందు ఈ గ్యాప్ 6-8 వారాలు మాత్రమే ఉంది. కోవిడ్ వ్యాక్సినేషన్‌పై కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ సిఫారసు మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే యూకె,యూరోప్ దేశాలు ఆస్ట్రాజెనెకా రెండో డోసుకు 12 వారాల గ్యాప్‌ను మాత్రమే పాటిస్తుంటే భారత్‌ ఇలా 16 వారాలకు దాన్ని పొడగించడం చర్చనీయాంశంగా మారింది.

Recommended Video

    Covishield Vaccine డోసుల మధ్య గ్యాప్ 12- 16 వారాలకు పెంచచ్చు!!
    కేంద్రం ఏం చెబుతోంది..

    కేంద్రం ఏం చెబుతోంది..


    'ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధారాలను ప్రాతిపదికగా చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రధానంగా యూకె‌లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను 12-16 వారాల గ్యాప్‌తో ఇస్తున్నారు. ఇక్కడ కూడా దాన్ని అమలుచేయాలనుకుంటున్నాం. కోవాగ్జిన్ డోసుల విషయంలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. దానికి సంబంధించి ఇప్పటివరకూ ఎటువంటి ప్రతిపాదనలు లేవు.' అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

    వ్యాక్సిన్ల కొరతే కారణమా...?

    వ్యాక్సిన్ల కొరతే కారణమా...?

    కోవీషీల్డ్ వ్యాక్సిన్ రెండో డోసుపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాక్సిన్ రెండో డోసును 16 వారాలకు పెంచడం వెనుక ఏ శాస్త్రీయ ప్రాతిపదిక ఉందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గతంలో 4-6 వారాల గ్యాప్‌తో వ్యాక్సిన్ రెండో డోసు ఇస్తే రోగ నిరోధక శక్తి బాగా వృద్ది చెందుతుందని చెప్పారు. ఆ తర్వాత దాన్ని 6-8 వారాలకు పెంచారు. దేశంలో వ్యాక్సిన్ల కొరత నెలకొన్న కారణంగానే రెండో డోసు గ్యాప్‌ను ఇంతలా పెంచి ఉండవచ్చునని నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

    డబ్ల్యూహెచ్ఓ గతంలో ఏం చెప్పింది...

    డబ్ల్యూహెచ్ఓ గతంలో ఏం చెప్పింది...

    ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ స్పెయిన్ మాత్రమే ఇలా 16 వారాల గ్యాప్‌తో ఆస్ట్రాజెనెకా రెండో డోసును ఇస్తున్నట్లు తెలుస్తోంది. డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ గతంలో మాట్లాడుతూ... ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ అభివృద్ది చేసిన కోవీషీల్డ్ సహా పలు వ్యాక్సిన్లను 12 వారాల గ్యాప్‌లో రెండో డోసు ఇవ్వడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతున్నట్లు చెప్పారు. దానికి సంబంధించి తమ వద్ద కొంత డేటా కూడా ఉందన్నారు. లాన్సెట్ మెడికల్ జర్నల్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. రెండో డోసుకు 12 వారాల గ్యాప్ ఇవ్వడం ద్వారా వ్యాక్సిన్ 81.3శాతం మెరుగ్గా పనిచేస్తున్నట్లు తెలిపింది. అదే కేవలం ఆరు వారాల గ్యాప్‌తో వ్యాక్సిన్ రెండో డోసు ఇస్తే దాని సమర్థత కేవలం 55.1శాతం మేరకే ఉంటుందని పేర్కొంది.

    గతంలో ఇదే సిఫారసును తిరస్కరించిన కేంద్రం

    గతంలో ఇదే సిఫారసును తిరస్కరించిన కేంద్రం


    యూకె,యూరోప్ దేశాలు 12 వారాల గ్యాప్‌నే పాటిస్తుండటం,డబ్ల్యూహెచ్ఓ కూడా గతంలో ఇదే సూచించిన నేపథ్యంలో భారత్ తీసుకున్న నిర్ణయంపై చర్చ జరుగుతోంది. నిజానికి కోవీషీల్డ్ వ్యాక్సిన్ రెండో డోసు గ్యాప్‌ను 12 వారాలకు పెంచాలని గతంలో నిపుణుల కమిటీ సిఫారసు చేసినప్పుడు కేంద్రం దాన్ని తిరస్కరించిందని కోవిడ్ 19 టాస్క్‌ఫోర్స్ సభ్యుడు ఒకరు తెలిపారు. దీంతో వ్యాక్సిన్ కొరత కారణంగానే కేంద్రం ఈ గ్యాప్‌ను 16 వారాలకు పెంచి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాక్సిన్‌‌ అడ్మినిస్ట్రేషన్‌పై నియమించిన నిపుణుల కమిటీ చీఫ్ వీకె పాల్ మాట్లాడుతూ... కరోనా నుంచి కోలుకున్నవారు ఆర్నెళ్ల గ్యాప్ తర్వాత వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పడం గమనార్హం. గర్భిణీ స్త్రీలు ఏ వ్యాక్సిన్ తీసుకోవాలన్నది వారికే ఛాయిస్ ఇవ్వాలని నీతి ఆయోగ్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+